వింటర్లో ట్రిప్‌కి వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే వింటర్లో ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీనివల్ల మీ ప్రయాణంలో ఇబ్బందులుండవు. మీరు వెళ్లే ప్రదేశంలో వెదర్ ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుని.. దానికి తగ్గట్లు డ్రెస్‌లు ఎంచుకోవాలి. చలి ఎక్కువగా ఉంటే స్వెట్టర్లు కాకుండా డ్రెస్‌ను లేయర్లుగా వేసుకోవాలి. హ్యాట్, గ్లౌవ్‌లు, స్కార్ఫ్ ఉండేలా చూసుకోవాలి. జర్నీలో డీహైడ్రేషన్ కాకుండా రెగ్యులర్‌గా నీటిని తీసుకోవాలి. ఇది హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మీరు వెళ్లే ప్రాంతంలో స్లోప్స్, ఫ్రోజెన్ లేక్స్, ఐసీ సైడ్‌వాక్స్ వంటివి ఉన్నాయేమో ముందే తెలుసుకోవాలి. వాటర్ ప్రూఫ్ దుస్తులు, ఫూట్ వేర్ కూడా కవర్డ్ బూట్లు వేసుకుంటే చలి తీవ్రత తగ్గుతుంది. లోకల్‌గా ఫాలో అయ్యే రూల్స్, రెగ్యూలేషన్స్ గుంచి తెలుసుకోవాలి. వాటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి. మెడిసిన్ కిట్‌ని కచ్చితంగా క్యారీ చేయాలి. స్నాక్స్ తీసుకెళ్తే ఫుడ్ బాగోకపోయిన ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఫోన్ ఛార్జింగ్, పవర్ బ్యాంక్ కచ్చితంగా తీసుకెళ్లాలి. ఎమెర్జెన్సీలో ఇబ్బంది పడుకుండా హెల్ప్ అవుతుంది.