చలికాలంలో పిల్లలకు క్యారెట్స్ తినిపిస్తే కలిగే ప్రయోజనాలివే
క్యార్టెట్స్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను దూరం చేసి.. రెటీనా హెల్త్‌ని కాపాడుతుంది.
క్యారెట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇమ్యూనిటీని పెంచడంలో సహాయం చేస్తాయి. జలుబు, ఫ్లూ లక్షణాలను దూరం చేస్తాయి.
పిల్లల స్కిన్ హెల్త్‌కి క్యారెట్స్ మంచివి. వీటిలోని విటమిన్ ఏ హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని, సోరియాసిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
క్యారెట్స్ పళ్లను క్లీన్ చేస్తాయి. క్రంచీగా ఉండే వీటిని స్నాక్‌గా తీసుకుంటే నోటిలో సలైవా ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల నోటి అల్సర్, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
క్యారెట్స్‌లో యాంటీసెప్టిక్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తాయి.
చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను క్యారెట్స్ దూరం చేస్తాయి. వీటిలోని డైటరీ ఫైబర్ గట్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది.
పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్లు వంటివి అలవాటు చేయకుండా లేదా వాటిని తినడాన్ని తగ్గించడానికి క్యారెట్లను హెల్తీ స్నాక్‌గా ఇవ్వొచ్చు.
క్యారెట్లును యోగర్ట్‌తో కలిపి స్నాక్‌గా, సలాడ్స్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు.
ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.