మొక్కజొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సమస్యలు, క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడి.. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ బి3 ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి లైంగిక జీవితానికి హెల్ప్ చేస్తుంది. కార్న్‌లో మినరల్స్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి. వీటిలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. గుండె సమస్యలను తగ్గిస్తాయి. మొక్కజొన్నలు శరీరంలో మంచి బాక్టీరియాను పెంచి గట్ హెల్త్‌ను ప్రమోట్ చేస్తాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వయసు ద్వారా పెరిగే మతిమరుపు, అల్జీమర్స్ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. స్కిన్ హెల్త్‌ను ప్రమోట్ చేస్తాయి. వృద్ధాప్యఛాయలను దూరం చేసి యవ్వనమైన స్కిన్‌ను అందిస్తాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. విటమిన్స్, మినరల్స్ జుట్టు పెరుగుదలను, గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.