అన్వేషించండి

Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్

Telangana CM: ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగంలో పస లేదని రేవంత్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డిపలు కీలక విషయాలు చర్చించారు

Revanth Reddy: ఎల్కతుర్తి సభలో కేసీఆర్ అంతా అక్కసే వెళ్లగక్కారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్ ఖజానాను లూటీ చేసి పోయి ఇప్పుడు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. తాను ఇంకా ఇరవై ఏండ్లు రాజకీయాల్లో ఉంటానని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజలు పదేళ్లు చాన్స్ ఇస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.  కేటీఆర్, హరీష్ రావులను పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడు. మరి వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుండి పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటంన్నింటిని స్ర్టీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. 

తాను చట్టప్రకారమే నడుచుకుంటానని..అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్ట్ చేయించలేనని స్పష్టం చేశారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డామని.  స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామని తెలిపారు. కొంత మంది అధికారుల  తీరు గురించి తనకు తెలుసని అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ మాటల్లో స్పష్టత లేదని.. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేసి, ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని రేవంత్ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు.అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని మార్చుకుంటున్నారని విమర్శించారు. దేశానికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ లాంటి నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.  ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు. నక్సలైటన్లను ఏరివేసే ఆపరేషన్ కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని రేవంత్ అన్నారు. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.                     
 
నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించానన్నారు. అయితే కొంత మంది కాంగ్రెస్ నేతలు దారి తప్పుతున్నారని అన్నారు. పదవుల కోసం బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడితే పదవులు రావన్నారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారని.. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదని స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో అందర్ని అప్రమత్తం చేస్తున్నా మార్పు రావడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.  ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, వారు వెళితేనే పథకాలు ప్రజల్లోకి వెళతాయని అన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని హెచ్చరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Haryana News: హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య -  ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య - ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
Bihar BJP Candidates List 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బిజెపి మొదటి జాబితా విడుదల, 7 సార్లు గెలిచిన నేతకు మొండిచేయి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బిజెపి మొదటి జాబితా విడుదల, 7 సార్లు గెలిచిన నేతకు మొండిచేయి
Viral News: శరవేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్ - స్కూళ్లన్నీ మూసివేత - ఆస్పత్రుల్లో 6 వేల మంది విద్యార్థులు !
శరవేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్ - స్కూళ్లన్నీ మూసివేత - ఆస్పత్రుల్లో 6 వేల మంది విద్యార్థులు !
Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
Advertisement

వీడియోలు

Edge Of The Universe Explained : విశ్వానికి ఆది, అంతం తెలుసుకోవటం సాధ్యమేనా..? | ABP Desam
Eiffel Tower Demolition | ఈఫిల్ టవర్ కూల్చివేత | ABP Desam
Smriti Mandhana Records | India vs Australia | స్మృతి మంధానా ఫాస్టెస్ట్ రికార్డ్ | ABP Desam
India vs Australia ODI World Cup | నిరాశపరిచిన భారత్ | ABP Desam
India vs West Indies Test Match | పోరాడుతున్న విండీస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Haryana News: హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య -  ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య - ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
Bihar BJP Candidates List 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బిజెపి మొదటి జాబితా విడుదల, 7 సార్లు గెలిచిన నేతకు మొండిచేయి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బిజెపి మొదటి జాబితా విడుదల, 7 సార్లు గెలిచిన నేతకు మొండిచేయి
Viral News: శరవేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్ - స్కూళ్లన్నీ మూసివేత - ఆస్పత్రుల్లో 6 వేల మంది విద్యార్థులు !
శరవేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్ - స్కూళ్లన్నీ మూసివేత - ఆస్పత్రుల్లో 6 వేల మంది విద్యార్థులు !
Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
Superwood: స్టీల్ కన్నా బలమైనది,తేలికైనది .. సూపర్ ఉడ్ వచ్చేసింది !
స్టీల్ కన్నా బలమైనది,తేలికైనది .. సూపర్ ఉడ్ వచ్చేసింది !
Nidadavolu Junction: నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
No Discrimination In The Vedas: వేదాలలో ఎలాంటి వివక్ష లేదు, భారత్‌లో గొప్ప సంస్కృతి.. పతంజలి గురుకుల ఉత్సవంలో స్వామి రాందేవ్
వేదాలలో ఎలాంటి వివక్ష లేదు, మనది గొప్ప సంస్కృతి.. పతంజలి గురుకులంలో స్వామి రాందేవ్
Chiru Bobby 2: చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
చిరంజీవి సరసన 'ది రాజా సాబ్' హీరోయిన్... ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు!
Embed widget