ED Raids: హైదరాబాద్‌లో పాతబస్తీ సహా 8 చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, భూదాన్ భూములలో అక్రమాలు
Hyderabad News | ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో పాతబస్తీ సహా 8 చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ ఆకస్మిక దాడులు చేపట్టింది. సంతోష్ నగర్, యాకుత్ పురా సహా నగరంలోని మొత్తం 8 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు. భూదాన్ భూముల వ్యవహారంలో ED సోదాలు చేపట్టింది. మహేశ్వరం భూముల విషయంలో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
పాతబస్తీలోని మన్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, సర్ఫాన్, సుకూర్ ఇళ్లలో, పలువురు ఐఏఎస్, అధికారుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈఐపీఎల్ కంపెనీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు భూములు విక్రయించింది. ఈ కంపెనీకి సుకూర్ బినామీగా ఉండగా అతడి నివాసంతో పాటు అతడి సన్నిహితులు సర్ఫాన్, మరికొందరి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూదాన్ భూముల కొనుగోలు వ్యవహారంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో పాటు మహేశ్వరం ఎమ్మార్వోను ఈడీ అధికారులు విచారించారు. వారిని ప్రశ్నించి స్టేట్మెంట్ తీసుకున్నారు.






















