New Swadeshi Movement: భారత ప్రగతి గతిని మారుస్తున్న స్వదేశీ సంస్థలు
Indigenous Induistries: మన స్థానిక పరిశ్రమలే.. ఇండియా కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. పతంజలి, టాటా, అముల్ ఇవే ఇప్పుడు భారత పారిశ్రామిక ప్రగతి రథ చక్రాలు.

Swadeshi induisty Movement: మన పరిశ్రమలు కొత్త భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తుున్నాయి. భారత పారిశ్రామిక రథానికి చోదక శక్తిగా పనిచేస్తన్నాయి. మేక్ ఇన్ ఇండియాకు అసలైన మోడల్ గా నిలుస్తున్నాయి. స్వదేశీ కంపెనీలైన పతంజలి, టాటా, అమూల్ వంటివి ఇండియన్ గ్రోత్ స్టోరీని మారుస్తున్నాయి.
ఇది మరో స్వదేశీ ఉద్యమం
స్వదేశీ ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో కీలకమైన ఘట్టం. ఇప్పుడు మరోసారి అదే స్వదేశీ ఉద్యమం.. భారత్ స్వయ సంవృద్ది పయనాన్ని నిర్దేశిస్తోంది. ఇది ఆర్థిక స్వావలంబనను మాత్రమే కాదు.. జాతీయ గౌరవాన్ని, సాంస్కృతిక గుర్తింపును ఇనుమడింపజేస్తోంది. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే భావన, తద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్ష ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలిపే కార్యక్రమంలో అనేక స్థానిక పరిశ్రమలు నిరంతరం పనిచేస్తున్నాయి.
పతంజలి మార్గనిర్దేశనం
భారత్ పరిశ్రమకు నిదర్శనంగా నిలిచే పతంజలి.. ఈ విషయంలో ఎంతో ముందడుగు వేసింది. బ్రాండ్ భారత్ ను ప్రమోట్ చేయడంలో ఎంతో ముందుంది. భారత్ ఆత్మ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున తీసుకెళ్తోంది. స్వదేశీ పారిశ్రామికోద్యమంలో ప్రధానమైన ‘Made in India’ ను పతంజలి తమ కోర్ బిజినెస్ ప్రిన్సిపల్‌గా పాటిస్తోంది. ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించిన భారత్ నుంచి ఆ బ్రాండ్ తెలిసేలా పతంజలి.. ఆయుర్వేద, సహజ ఉత్పత్తులైన సబ్బులు, నూనెలు, ఔషధాలు, ఇతర ఆహార పదార్థాలను ఇంటింటికీ చేరుస్తోంది. గడచిన 15 ఏళ్లలో పతంజలిని ప్రతి ఇంటిలో ఉపయోగించే పేరుగా మలిచి అసలైన Made in India కు అర్థం చెప్పింది.
బ్రాండ్ స్వదేశీ
అంతేకాదు.. వందేళ్లకు పైగా భారత్ ఇండస్ట్రీకి చిరునామాగా నిలిచిన టాటా గ్రూప్, రిలయన్స్ జియో, అమూల్ డైయిరీ వంటివి కూడా భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రొడక్టులు. బ్రాండ్ స్వదేశీ అన్నదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఎక్కువుగా ప్రోత్సహిస్తున్నారు. ఎక్కువుగా స్వదేశీ ఉత్పత్తులు వాడమని ఆయన తరుచుగా చెబుతూనే ఉన్నారు. 2020 లోని ఓ ప్రసంగంలో “ Vocal for Local ( స్వదేశీని ప్రచారం చేయడం) అనేది మన మంత్రం కావాలి. మన ఉత్పత్తులను ఉపయోగించాలి. అదే ఆత్మనిర్భర భారత్‌కు అసలైన పునాది ” అని ఆయన స్పష్టంగా చెప్పారు. రసాయన రహిత వ్యవసాయాన్ని చేపట్టాలని ఆయన తరచుగా చెబుతున్నారు. ఇది స్వావంలబంనలో ఓ భాగమన్నారు. ఈ నినాదం కేవలం ఆర్థిక బలోపేతానికి ఇచ్చింది మాత్రమే కాదు. సమాజిక, పర్యావరణ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రధాని ఆ పిలుపునిచ్చారు.
ఇటీవల అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ‘Swadeshi’ ఆవశ్యకత మనకు అర్థం అవుతుంది. ఇది దిగుమతులపై పడుతున్న భారాన్ని తగ్గించడమే కాదు. మన స్థానిక రైతులు, కుటీర పరిశ్రమలు, కళాకారులకు చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని ఇప్పటికే మొదలైన ఆలోచన మరింత బలోపేతం కావాలిసిన అవసరం ఉంది . స్వదేశీ ఉద్యమం కొనుగోలుకు సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు.. జాతి నిర్మాణానికి సంబంధించిన ఓ ముందడుగు.





















