అన్వేషించండి

Telangana Bhoodan Lands: భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం

Telangana Lands: తెలంగాణలో భూదాన్ ల్యాండ్స్ అక్రమాల్లో సీనియర్ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ కూడా ఈ అంశంలో విచారణ జరుపుతోంది.

Bhoodan Lands Issue: తెలంగాణలో భూదాన్ భూముల అక్రమాలకు సంబంధించి కొంత మంది ఉన్నతాధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోది. ఈ వ్యవహారంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం 2025 ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టు  సీబీఐ ,  ఈడీ దర్యాప్తు ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. తాజాగా ఈ అంశంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

1950లలో వినోబా భావే ఆధ్వర్యంలో పేద రైతుల కోసం భూములను సేకరించి పంపిణీ చేసే ఉద్యమం జరిగింది. ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు ఆధీనంలో ఉంటాయి మ. వీటిని అన్యాక్రాంతం చేయడం,  విక్రయించడం చట్టవిరుద్ధం. నాగారం గ్రామంలో సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూదాన్ భూములు అక్రమంగా అమ్మకాలు, కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  సీనియర్ ఐఏఎస్ అధికారులు , ఐపీఎస్ అధికారులు సహా మొత్తం 26 మంది ఉన్నతాధికారులు  ఈ స్థలాలను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.   అధికారులు తమ పేర్లపై లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లపై బినామీల ద్వారా భూములను రిజిస్టర్ చేసుకున్నారని కోర్టులో పిటిషన్ దాఖలయింది.  భూదాన్ భూములు చట్టపరంగా అమ్మకాలు నిషిద్ధం అయినప్పటికీ తమకు ఉన్న అధికారాలతో  అక్రమంగా కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
పిటిషన్ పై విచారణలో హైకోర్టు   సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మహేశ్వరం ,  ఎల్బీనగర్ సబ్-రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు లేదా మార్పులు చేయరాదని షరతు విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీబీఐ, ఈడీ, అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో   ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం వివాదాస్పదమయింది.                   

గతంలో ఈ భూములపై ఈడీ విచారణ చేసింది. ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్ ను పలుమార్లు విచారణకు పిలిచింది.  డి. అమోయ్ కుమార్  రంగారెడ్డి ,  మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూదాన్ భూముల అక్రమాలు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది.   అమోయ్ కుమార్ ధరణి పోర్టల్‌లో భూమి యాజమాన్య రికార్డులను అక్రమంగా మార్చి, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేశారని ఆరోపణలు ఉన్నాయి.  - ధరణి పోర్టల్‌ను BRS ప్రభుత్వం భూమి రికార్డుల డిజిటైజేషన్ కోసం ప్రవేశపెట్టింది. అయితే, అమోయ్ కుమార్ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి, భూమి యాజమాన్య హక్కులను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వవ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండటంతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఆసక్తి ఏర్పడింది. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget