అదిరిపోయే న్యూస్ చెప్పిన టయోటా - ప్రీమియం ఫీచర్లతో వస్తున్న కొత్త 7 సీటర్ SUV
Toyota Upcoming 7-Seater SUV:భారత్ మార్కెట్‌లోకి టయోటా త్వరలోనే కొత్త 7 సీటర్ SUV తీసుకొస్తోంది. హైరైడర్ మోడల్‌గా దీన్ని ప్రవేశపెట్టనుంది. దీని ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ వివరాలు త్వరలోనే వెల్లడించనుంది.

Toyota Upcoming 7-Seater SUV: టయోటా త్వరలోనే తన కొత్త 7-సీటర్ SUVను భారతదేశం మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇది ప్రస్తుత అర్బన్ క్రూజర్ హైరైడర్ 7-సీటర్ వెర్షన్‌లో తీసుకొస్తోంది. ఈ కారులో ప్రీమియం ఫీచర్లు, అధునాతన భద్రతా సాంకేతికత కనిపిస్తుంది. మీరు ఒక స్టైలిష్, సురక్షితమైన, ఫీచర్-లోడెడ్ 7-సీటర్ SUV కొనుగోలు చేయాలని అనుకుంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ కొత్త కారు తీసుకుంటే మీకు మీకు ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.
SUV బయట డిజైన్ ఎలా ఉంటుంది?
టెస్టింగ్ సమయంలో కొత్త SUV ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది ఫొటోలు షేర్ చేశారు. దీంతో ఈ కారుపై జనాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. వైరల్ అవుతున్న ఫొటోల్లో కారు కవర్‌తో కప్పేసి ఉన్నప్పటికీ దాని హైట్ ఇతర అంశాలను పరిశీలించి ఓ అంచనాకు వస్తున్నారు. ఈ చిత్రాలను చూసి, ఈ మోడల్ పరిమాణం ప్రస్తుత Hyryder కంటే పెద్దదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ SUV లో కొత్త డ్యూయల్-పార్ట్ LED టైల్ లైట్లు, కొత్త టైల్ గేట్ డిజైన్, అప్డేట్ చేయసిన అల్లాయ్ వీల్స్, కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ డిజైన్ చూడముచ్చటగా ఉంటుందని అంటున్నారు. ఈ మార్పులతో, SUV రూపం మునుపటి కంటే చాలా భిన్నంగా ఉంటుందని, శక్తిమంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంచనా వేస్తున్నారు.
ఇంటీరియర్‌లో ఈ కొత్త ఫీచర్లు చాలా ఉంటాయా?
కొత్త టోయోటా 7-సీటర్ SUV క్యాబిన్‌లో అనేక కొత్త, ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ఇందులో మోడరేట్లీ రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, రియర్ AC వెంట్లు, పనోరామిక్ సన్ రూఫ్, ADAS టెక్నాలజీ (ఉదాహరణకు ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్) లభించవచ్చు. ఈ ఫీచర్లన్నీ క్యాబిన్ ను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేయబోతున్నాయని టాక్ నడుస్తోంది.
ఇంజిన్ సహా ఇతర విషయాల్లో పనితీరు
కొత్త SUVలో ప్రస్తుతం అర్బన్ క్రూజ్ హైరైడర్‌లో అందుబాటులో ఉంది. అదే ఇంజిన్ సెటప్ రాబోయే ఎస్‌యూవీలో లభిస్తుంది. ఈ సెటప్ 1.5L పెట్రోల్ ఇంజిన్, 1.5L స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికతో రావచ్చు. ఈ కలయిక ద్వారా వినియోగదారులకు మెరుగైన మైలేజ్, మరింత శక్తిమంతంగా పని చేస్తుందని అంటున్నారు. ఇది సుదూర ప్రాంతాలు పర్యటించే టైంలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎప్పుడు మార్కెట్‌లోకి రావచ్చు, పోటీ ఎలా ఉంటుంది?
వివిధ మార్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం టోయోటా ఈ కొత్త 7-సీటర్ SUV ను 2025 చివరి నాటికి భారతదేశ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నారు. అదే టైంలో మారుతి సుజుకి దాదాపు అలాంటి ఫీచర్స్‌తో తన 7-సీటర్ SUV విడుదల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇటీవల కాలంలో టెస్టింగ్ పూర్తి చేసుకుంది. అంటే ఈ ఏడాది చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి రెండు కొత్త 7-సీటర్ SUVలు రాబోతున్నాయి. వీటి రేట్లు ఎంత ఉంటాయి. ఇతర విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.





















