Maruti Brezza Rival Cars: ఈ 5 కార్లు మారుతి బ్రెజ్జాకు గట్టి పోటీ - బడ్జెట్ దాదాపు సేమ్!
Top 5 Best Alternatives To Brezza: మారుతి బ్రెజ్జా కొనే బదులు దాదాపు అదే బడ్జెట్‌లో వచ్చే మరేదైనా SUV కోసం సెర్చ్ చేస్తుంటే, మీ ఎదుట 5 బెస్ట్ ఆప్షన్లు కనిపిస్తాయి.

Cars That Compete With Maruti Brezza: మన దేశంలో, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.14 లక్షల వరకు, వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఈ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) కొనేవాళ్లకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ & CNG ఆప్షన్లు ఉన్నాయి. మారుతి బ్రెజ్జా మైలేజ్ విషయానికి వస్తే, CNG వెర్షన్ కిలోగ్రాముకు 26 కి.మీ. వరకు మైలేజీ ఇవ్వగలదని కంపెనీ వెల్లడించింది.
మీకు మారుతి బ్రెజ్జా నచ్చకపోతే, అదే రేటులో వేరే బ్రాండ్ కోసం చూస్తుంటే, మంచి మైలేజ్ & మంచి ఫీచర్లు ఇచ్చే కార్‌లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
హ్యుందాయ్ వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.94 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.62 లక్షల వరకు ఉంటుంది. ఈ SUVలో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి - 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్. ఈ ఫోర్ వీలర్ 22.7 Kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కార్ క్యాబిన్‌లో 8 అంగుళాల టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కీలెస్ ఎంట్రీ, 6 ఎయిర్ బ్యాగ్‌లు & ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
కియా సోనెట్ (Kia Sonet)
కియా సోనెట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది. ఇందులో కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ చెప్పిన ప్రకారం, ఈ SUV మైలేజ్ 22.3 Kmpl వరకు ఉంటుంది. ఇందులో పెద్ద టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ADAS & 6 ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి.
మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO)
ఈ SUV ఎక్స్-షోరూమ్ రేటు రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.56 లక్షల వరకు ఉంటుంది. దీనిలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ &1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లు లభిస్తాయి. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, దీని మైలేజ్ 21 Kmpl వరకు ఉంటుంది. బెటర్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం కారులో 10.25-అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ AC, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా & ADAS లెవల్-2 ఫీచర్లను యాడ్ చేశారు.
కియా సైరోస్ (Kia Syros)
కొత్త కియా సైరోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.80 లక్షల వరకు ఉంటుంది. దీనికి 5-స్టార్ BNCAP రేటింగ్ లభించింది, సేఫ్టీ పరంగా బెస్ట్‌గా నిలిచింది. టర్బో పెట్రోల్ & డీజిల్ ఇంజిన్లతో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యం ఉంది. 30-అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ADAS & పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఈ SUV అందిస్తోంది.
స్కోడా కైలాక్ (Skoda Kylaq)
దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.89 లక్షలు, ఇది బ్రెజ్జా కంటే తక్కువ. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ కార్‌కు శక్తిని అందిస్తుంది, మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో డ్రైవ్ చేయవచ్చు. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు, ESC, హిల్-హోల్డ్ అసిస్ట్, 10-అంగుళాల టచ్ స్క్రీన్ & ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.





















