అన్వేషించండి

High Mileage Car: ఒక్క లీటర్‌కు 33 కి.మీ. మైలేజ్‌ ఇచ్చే ఈ కార్‌ రేటు కేవలం 4.26 లక్షలే!

Budget Car From Maruti: మారుతి లాంచ్‌ చేసిన ఈ కారు ఫస్ట్‌ టైమ్‌ బయ్యర్స్‌తో పాటు తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీని కోరుకునే వారికి మంచి ఎంపికగా మారింది.

Maruti S-Presso Price, Mileage And Features: మారుతి సుజుకి మినీ హ్యాచ్‌బ్యాక్ ఎస్-ప్రెస్సో, ప్రస్తుతం, కార్‌ మార్కెట్లో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. తొలి చూపులోనే ఆకర్షించే ఔట్‌లుక్‌ (డిజైన్), కామన్‌ మ్యాన్‌కు భారం కాని బడ్జెట్‌, లీటర్‌ ఇంధనంతో కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తే మేలైన మైలేజ్, చిన్న కుటుంబం చింత లేకుండా కూర్చోగల స్థలం వంటి లక్షణాలు ఈ కార్‌ను FY2025లో ప్రజలకు అత్యంత ఇష్టమైన చవక కార్లలో ఒకటిగా నిలిపాయి. ఏప్రిల్ 2024 - మార్చి 2025 మధ్య, దేశవ్యాప్తంగా 23,538 మంది కస్టమర్లు ఈ బడ్జెట్‌ కారును కొనుగోలు చేశారు.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో చూపులకే కాదు, పనితనంలోనూ ప్రత్యేకమైనది. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు అందించడంతో పాటు, పట్టణ రోడ్లు & గ్రామీణ రహదారులు రెండింటికీ అతికినట్లు సరిపోతుంది.

మారుతి ఎస్-ప్రెస్సో ధర & వేరియంట్స్‌
భారతీయ మార్కెట్లో, మారుతి ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూమ్‌ ధర (Maruti S-Presso ex-showroom price) రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, ఇది దాని STD బేస్ వేరియంట్ రేటు. ఎస్-ప్రెస్సో టాప్ వేరియంట్ VXI CNG ధర రూ. 6.12 లక్షల వరకు ఉంటుంది. CNG మోడల్ రేటు రూ. 5.91 లక్షలు నుంచి స్టార్‌ అవుతుంది. ఈ టాల్-బాయ్ స్టాన్స్ హ్యాచ్‌బ్యాక్ కారు 8 విభిన్న వేరియంట్లలో (8 variants in Maruti S-Presso) లాంచ్‌ అయింది. దీని అర్ధం... అవసరానికి అనుగుణంగా ఎంచుకోవడానికి వీలుగా కొనుగోలుదారుడి ఎదుట 8 రకాల ఆప్షన్లు ఉన్నాయి.

మారుతి ఎస్-ప్రెస్సో డిజైన్ & ఫీచర్లు
మారుతి ఎస్-ప్రెస్సో ఒక పొడవైన బాయ్ స్టైల్ కారు. ఈ కారుకు 14-అంగుళాల చక్రాలను బిగించారు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉంది. అంటే, గుంతలతో కూడిన క్లిష్టమైన రోడ్లపైనా ఇబ్బంది లేని డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందించగలదు. 

మారుతి ఎస్-ప్రెస్సో పవర్‌ట్రెయిన్ & మైలేజ్‌
ఈ మినీ హ్యాచ్‌బ్యాక్ 8 వేరియంట్లలో బేస్ మోడల్ STD & టాప్ వేరియంట్ VXI CNG. ఈ కారుకు పవర్‌ అందించడానికి 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను బిగించారు, ఇది 68 PS పవర్‌ను & 90 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ కూడా ఈ కారులో లభిస్తుంది. అయితే, CNG వెర్షన్ మాత్రం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం, మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.12 నుంచి 25.30 కిలోమీటర్ల మైలేజీని & CNG వేరియంట్ కిలోగ్రాముకు 32.73 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.

స్మార్ట్ ఫీచర్లు & భద్రత ఏర్పాట్లు
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 7-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, సెమీ-డిజిటల్ క్లస్టర్, రెండు ఎయిర్‌ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ & ABS+EBD వంటి సూపర్‌ ఫీచర్లను మారుతి అందించింది. బడ్జెట్‌ కారు అయినప్పటికీ భద్రత విషయంలో లోటు చేయలేదు. తక్కువ ధరలో మెరుగైన మైలేజ్ & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కోరుకునే వారికి మారుతి ఎస్-ప్రెస్సో నమ్మదగిన ఆప్షన్‌ అని నిపుణులు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget