అన్వేషించండి

బుల్ బార్‌లపై కేంద్రం నిషేధం - మీ కారుకు ఉంటే వెంటనే తీసేయండి, లేదంటే ఫైన్ తప్పదు

కార్లకు బంపర్ గార్డ్ లేదా బుల్ బార్ వాడటం భారతదేశంలో నిషేధం. MoRTH 2017లో ఈ నిబంధన అమలు చేసింది. ఇవి వాహనానికి ఉంటే రూ.5000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలో కార్ల బంపర్ గార్డ్స్, బుల్ బార్స్ చట్టవిరుద్ధం.
  • 2017 నుండి వాహన భద్రత, ఎయిర్‌బ్యాగ్స్ పనితీరుపై ప్రభావం.
  • పాదచారులకు ప్రమాదం, గాయాల తీవ్రత పెరిగే అవకాశం.
  • బంపర్ గార్డ్స్ తొలగించకపోతే రూ.5000 వరకు జరిమానా.

Car bumper guard fine India: భారత్‌లో చాలా మంది వాహనదారులు తమ కారును మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు లేదా అదనపు రక్షణ కోసం కొన్ని యాక్సెసరీలను అమర్చుకుంటారు. వాటిలో ముఖ్యంగా కనిపించేది బంపర్ గార్డ్. దీనిని సాధారణంగా బుల్ బార్ ‍‌(Bull bar) లేదా క్రాష్ గార్డ్ (Crash guard) అని కూడా పిలుస్తారు.

ఈ మెటల్ బార్‌లను సాధారణంగా కారు ముందు లేదా వెనుక బంపర్‌పై అమరుస్తారు. ముఖ్యంగా SUVలు లేదా పెద్ద కార్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కారుకు రక్షణ కల్పిస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ, ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. నిజానికి, మన దేశంలో ఈ బుల్ బార్‌లు/బంపర్‌ గార్డ్‌లను వాడటం చట్టవిరుద్ధం అనే విషయం చాలా మందికి తెలియదు.

2017లోనే కేంద్రం నిషేధం

వాహన భద్రతను దృష్టిలో ఉంచుకుని, 'రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ' (MoRTH) 2017లో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కార్లకు బుల్ బార్‌లు లేదా బంపర్ గార్డ్‌లను నిషేధించింది. 

కార్లకు మాత్రమే కాదు, ఈ నిబంధన దాదాపు అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా SUVలు, జీపులు లేదా ఇతర కార్లకు అదనంగా అమర్చే మెటల్ గార్డ్‌లు వాహన భద్రత ప్రమాణాలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.

ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం

బంపర్ గార్డ్‌లు కారుకు అదనపు రక్షణ ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ భద్రత నిపుణుల ప్రకారం ఇవి ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది.

సాధారణంగా కారు ఢీకొన్నప్పుడు వాహనంలోని సెన్సార్‌లు ప్రభావాన్ని గుర్తించి వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లను తెరుస్తాయి. కానీ ముందు భాగంలో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్‌ ఉండటం వల్ల ఆ ప్రభావం సెన్సార్‌లకు సరైన విధంగా చేరకపోవచ్చు. 
దీని కారణంగా, కొన్ని సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పని చేయకపోవచ్చు. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.

పాదచారులకు కూడా ప్రమాదం

బుల్ బార్‌ లేదా బంపర్ గార్డ్‌ కేవలం కారులో ఉన్నవారికే కాకుండా పాదచారులకు కూడా ప్రమాదకరం. ఈ మెటల్ బార్‌లు చాలా దృఢంగా ఉండటం వల్ల ప్రమాద సమయంలో గాయాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా, ప్రమాద సమయంలో పాదచారులపై ప్రభావాన్ని కొంత వరకు తగ్గించేలా కార్ల బంపర్‌లను రూపొందిస్తారు. కానీ బుల్ బార్‌లు ఉండటం వల్ల ఆ రక్షణ తగ్గిపోతుంది. రోడ్డుపై నడిచే వ్యక్తులకు తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఎంత జరిమానా పడుతుంది?

కారుకు బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ అమర్చడం మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం నేరం. సెక్షన్ 190 & 191 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సమయంలో వాహనంలో బుల్ బార్ కనిపిస్తే రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించవచ్చు.

అదేవిధంగా, రోడ్లపై బుల్ బార్‌తో వాహనం నడుపుతున్నట్లు గుర్తిస్తే, అక్కడికక్కడే వాటిని తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది.

వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం

చాలా మంది స్టైల్ కోసం లేదా కారుకు రక్షణ కోసం బుల్ బార్‌లను అమర్చుకుంటున్నారు. కానీ ఇవి చట్టపరంగా నిషేధితమైనవే కాకుండా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ కారులో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ ఉంటే వెంటనే తొలగించడం మంచిది. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు తనిఖీ సమయంలో జరిమానా తప్పకపోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

భారత్​లో బంపర్ గార్డ్​లు (బుల్​ బార్​) వాడకం చట్టవిరుద్ధమా?

అవును, భారత్​లో కార్లకు బంపర్ గార్డ్​లు లేదా బుల్​ బార్​లను అమర్చడం చట్టవిరుద్ధం. 2017లోనే కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించింది.

బంపర్ గార్డ్​లు ఎయిర్​బ్యాగ్​ల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయి?

బంపర్ గార్డ్​లు ప్రమాద సమయంలో ఎయిర్​బ్యాగ్​ సెన్సార్​లకు సరైన ప్రభావాన్ని చేరనీయవు. దీనివల్ల ఎయిర్​బ్యాగ్​లు సమయానికి తెరచుకోకపోవచ్చు, వాహన ప్రయాణికులకు ప్రమాదం పెరగవచ్చు.

బంపర్ గార్డ్​లు పాదచారులకు ఎలా ప్రమాదకరం?

బుల్​ బార్​లు చాలా దృఢంగా ఉండటం వల్ల ప్రమాద సమయంలో పాదచారులకు గాయాల తీవ్రతను పెంచుతాయి. కార్ల బంపర్​లు పాదచారులపై ప్రభావాన్ని తగ్గించేలా రూపొందించబడతాయి, కానీ బుల్​ బార్​లు ఈ రక్షణను తగ్గిస్తాయి.

బంపర్ గార్డ్​లు అమర్చిన వాహనాలకు ఎంత జరిమానా పడుతుంది?

ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సమయంలో బంపర్ గార్డ్​లు కనిపిస్తే రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించవచ్చు. పోలీసులు వాటిని తొలగించే అధికారం కూడా కలిగి ఉంటారు.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget