అన్వేషించండి

Tata Punch EV vs Citroen eC3 - ధర, రేంజ్, ఫీచర్లలో ఏ కారు ఎలా ఉంది, ఏది బెస్ట్‌?

Tata Punch EV & Citroen eC3 మధ్య ధర, రేంజ్, బ్యాటరీ, ఫీచర్లు, ఛార్జింగ్ వంటి అంశాల్లో పూర్తి పోలిక ఇది. ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే వారికి ఏది మంచి ఎంపిక?.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3 మధ్య ధరకు తేడా ఉంది.
  • సిట్రోయెన్ eC3 కంటే టాటా పంచ్ EV ఎక్కువ రేంజ్ ఇస్తుంది.
  • టాటా పంచ్ EV బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యంలో ముందుంది.
  • కొత్త ఎలక్ట్రిక్ SUVలలో టాటా పంచ్ EV ఆధిపత్యం చెలాయిస్తోంది.

Tata Punch EV vs Citroen eC3 Comparison: ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న SUV తరహాలో ఉండే ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో ప్రస్తుతం రెండు ప్రధాన మోడళ్లు ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి, అవి - Tata Punch EV & Citroen eC3.

టాటా, ఇటీవల, Punch EVని అప్‌డేట్ చేసి కొత్త బ్యాటరీలు, ఎక్కువ రేంజ్, కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరోవైపు Citroen eC3 కూడా ఈ విభాగంలో గట్టి ప్రత్యర్థిగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ SUVల మధ్య ధర, సైజు, బ్యాటరీ, రేంజ్ వంటి అంశాల్లో ఎలా పోలిక ఉందో క్లియర్‌గా అర్ధం చేసుకుందాం.

ధర - Punch EV చౌక

Tata Punch EV రూ.9.69 లక్షలు - రూ.12.59 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)
Citroen eC3 రూ.12.90 లక్షలు - రూ.13.53 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)

ధర విషయంలో Tata Punch EV స్పష్టంగా చౌకగా ఉంటుంది. Punch EV ప్రారంభ ధర రూ.10 లక్షల లోపే ఉండగా, Citroen eC3 బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

అంటే Punch EV దాదాపు రూ.3 లక్షల కంటే ఎక్కువ చౌకగా లభిస్తుంది. అందుకే బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే వారికి Punch EV మంచి ఎంపికగా కనిపిస్తుంది.

సైజు, డైమెన్షన్స్ - ఏ కారు పెద్దది?

సైజు విషయంలో Citroen eC3 కొంచెం పొడవుగా ఉంటుంది. కానీ Punch EV కొన్ని ఇతర అంశాల్లో ముందుంది.

పొడవు: eC3 - 3981 mm, Punch EV - 3880 mm

వీల్‌బేస్: eC3 - 2540 mm, Punch EV - 2445 mm

గ్రౌండ్ క్లియరెన్స్: Punch EV - 195 mm, eC3 - 170 mm

బూట్ స్పేస్: Punch EV - 366 లీటర్లు, eC3 - 315 లీటర్లు

Punch EVలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రామీణ రోడ్లు, గుంతల రోడ్లపై ప్రయాణించే వారికి ఉపయోగపడుతుంది. అలాగే బూట్ స్పేస్ కూడా Punch EVలో ఎక్కువగా ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్ - Punch EV స్పష్టమైన ఆధిక్యం

బ్యాటరీ విషయంలో Punch EV రెండు ఆప్షన్లతో వస్తుంది.

Tata Punch EV -  బ్యాటరీ 30kWh / 40kWh;    పవర్‌ 88 hp / 129 hp;       రేంజ్‌ 375 - 468 కి.మీ.
Citroen eC3 - బ్యాటరీ 29.2kWh;    పవర్‌ 57 hp;           రేంజ్‌ 246 కి.మీ.

Punch EVలో ఉన్న 40kWh బ్యాటరీ వెర్షన్ గరిష్టంగా 468 కి.మీ. రేంజ్ ఇస్తుంది. Citroen eC3 మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 246 కి.మీ. రేంజ్ ఇస్తుంది.

అంటే Punch EV ఒక ఛార్జ్‌తో 222 కి.మీ ఎక్కువ ప్రయాణించగలదు. పవర్ విషయంలో కూడా Punch EV ముందుంది.

ఛార్జింగ్ - ఈ విషయంలోనూ Punchదే వేగం

ఈ రెండు కార్లలో 3.3kW స్టాండర్డ్ ఛార్జర్ ఉంటుంది. అయితే Punch EVలో అదనంగా కొన్ని మెరుగైన ఛార్జింగ్ ఎంపికలు ఉన్నాయి.

Punch EVలో

7.2kW AC ఛార్జింగ్ సపోర్ట్

65kW DC ఫాస్ట్ ఛార్జింగ్

ఇవి ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే Punch EV త్వరగా ఛార్జ్ అవుతుంది. eC3 చిన్న బ్యాటరీ కారణంగా కొన్నిసార్లు 3.3kW ఛార్జర్‌తో కొంచెం త్వరగా ఛార్జ్ అవుతుందేమో కానీ మొత్తం ఛార్జింగ్ సామర్థ్యంలో Punch EV ముందుంటుంది.

మొత్తం చూస్తే, Tata Punch EV & Citroen eC3 రెండూ చిన్న ఎలక్ట్రిక్ SUVలు. కానీ ధర, రేంజ్, బ్యాటరీ ఎంపికలు, ఛార్జింగ్ సామర్థ్యం వంటి అంశాల్లో Punch EV స్పష్టంగా ముందుంది.

ముఖ్యంగా ఎక్కువ రేంజ్, తక్కువ ధర కావాలనుకునే వారికి Punch EV మంచి ఎంపికగా ఉంటుంది. మరోవైపు Citroen eC3 కొంచెం పెద్ద వీల్‌బేస్ కారణంగా క్యాబిన్ స్పేస్‌లో కొంత ప్రయోజనం ఇవ్వవచ్చు.

అయితే మొత్తం మీద చూస్తే ఎలక్ట్రిక్ SUV విభాగంలో ప్రస్తుతం Tata Punch EVకు మంచి ఆధిక్యం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Tata Punch EV మరియు Citroen eC3 మధ్య ధరలో తేడా ఏమిటి?

Tata Punch EV ధర రూ.9.69 లక్షల నుండి రూ.12.59 లక్షల వరకు ఉండగా, Citroen eC3 ధర రూ.12.90 లక్షల నుండి రూ.13.53 లక్షల వరకు ఉంది. Punch EV దాదాపు రూ.3 లక్షలు తక్కువ ధరలో లభిస్తుంది.

సైజు మరియు కొలతల పరంగా ఏ కారు పెద్దది?

Citroen eC3 కొంచెం పొడవుగా ఉంటుంది, కానీ Punch EV ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ (195 mm vs 170 mm) మరియు బూట్ స్పేస్ (366 లీటర్లు vs 315 లీటర్లు) అందిస్తుంది.

బ్యాటరీ మరియు రేంజ్ విషయంలో ఏది మెరుగైనది?

Tata Punch EV 30kWh/40kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది, ఇది 375-468 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. Citroen eC3 29.2kWh బ్యాటరీతో 246 కి.మీ. రేంజ్ ఇస్తుంది, కాబట్టి Punch EV స్పష్టంగా మెరుగైనది.

ఛార్జింగ్ సామర్థ్యం విషయంలో తేడా ఏమిటి?

రెండు కార్లలో 3.3kW స్టాండర్డ్ ఛార్జర్ ఉన్నప్పటికీ, Punch EV 7.2kW AC మరియు 65kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది, ఇది వేగంగా ఛార్జింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget