అన్వేషించండి

Tata Punch EV Facelift Price And Features:468 km రేంజ్‌తో వచ్చిన Tata Punch EV 2026 మోడల్‌ - బ్యాటరీ, ఫీచర్లు, డిజైన్‌లో వచ్చిన మార్పులు ఇవే

Tata Punch EV Facelift Price And Features:కొత్త Tata Punch EV ఇటీవల విడుదలైంది. పెద్ద బ్యాటరీ, 468 కి.మీ. రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మార్పులు వచ్చాయి. పాత మోడల్‌తో పోలిస్తే ఏమేం మారాయో వివరంగా తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త టాటా పంచ్ EV ధర రూ.9.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
  • పెద్ద బ్యాటరీ ప్యాక్స్ 30kWh, 40kWh తో 468 కి.మీ. రేంజ్.
  • 65kW DC ఫాస్ట్ ఛార్జింగ్, OTA అప్డేట్స్, 6 భాషల వాయిస్ కమాండ్స్.
  • డిజైన్ లో చిన్న మార్పులు, వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్ అప్డేట్.

Tata Punch EV Facelift Price And Features: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో అత్యంత చౌకైన SUVగా గుర్తింపు పొందిన Tata Punch EVకి కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ధర రూ.9.69 లక్షల నుంచి (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ప్రారంభమవుతుంది. బయట డిజైన్‌లో చిన్న మార్పులు చేసినప్పటికీ, అసలు పెద్ద మార్పు బ్యాటరీ & రేంజ్ విషయంలో కనిపిస్తుంది.

కొత్త Punch EVలో పెద్ద బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 468 కి.మీ. (ARAI క్లెయిమ్) వరకు రేంజ్ లభిస్తుంది. ఇప్పుడు కొత్త Punch EV పాత మోడల్‌తో పోలిస్తే ఏమేం మారాయో చూద్దాం.

బ్యాటరీ, పనితీరు - పెద్ద అప్‌గ్రేడ్

పాత Punch EVలో 25kWh & 35kWh బ్యాటరీ ప్యాక్స్ ఉండేవి. కానీ కొత్త మోడల్‌లో వాటి స్థానంలో 30kWh & 40kWh బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు.

30kWh వెర్షన్‌లో ఎలక్ట్రిక్ మోటర్ 88 hp పవర్ ఇస్తుంది. 40kWh వెర్షన్‌లో 129 hp పవర్ లభిస్తుంది. టార్క్ విషయంలో కొంచెం మార్పు ఉంది. కొత్త 40kWh వెర్షన్‌లో టార్క్ కొంచెం తక్కువగా ఉన్నా మొత్తం పనితీరు మాత్రం మెరుగ్గా ఉంటుంది.

రేంజ్ విషయంలో మాత్రం పెద్ద అప్‌గ్రేడ్ కనిపిస్తుంది.

30kWh వెర్షన్ - 375 కి.మీ. వరకు రేంజ్

40kWh వెర్షన్ - 468 కి.మీ. వరకు రేంజ్

ఇది పాత మోడల్‌తో పోలిస్తే 100 కి.మీ. పైగా అదనపు రేంజ్ ఇస్తుంది. టాటా ప్రకారం కొత్త మోటర్ డిజైన్ మరింత కాంపాక్ట్‌గా ఉండడం వల్ల పెద్ద బ్యాటరీ బరువును కూడా సులభంగా హ్యాండిల్ చేస్తుంది.

ఛార్జింగ్ - ఇప్పుడు మరింత వేగంగా

కొత్త Punch EVలో ఛార్జింగ్ వ్యవస్థను కూడా మెరుగుపరిచారు. AC ఛార్జింగ్ విషయంలో పాత మోడల్‌లాగే 7.2kW వరకు సపోర్ట్ ఉంటుంది. 

కానీ DC ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో పెద్ద మార్పు వచ్చింది. కొత్త Punch EVలో 65kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీంతో ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కారు ఇంకా త్వరగా ఛార్జ్ అవుతుంది.

డిజైన్ - బయట చిన్న మార్పులు

కొత్త Punch EV బయటి డిజైన్‌లో చిన్న మార్పులు మాత్రమే చేశారు. ముందు భాగంలో ఉన్న కనెక్టెడ్ LED లైట్ బార్ తొలగించారు. ఇప్పుడు హెడ్‌ల్యాంప్స్ దగ్గర LED DRLs ఇచ్చారు.

బంపర్ డిజైన్ కూడా కొంచెం మార్చారు. కొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఇచ్చి SUV లుక్‌ను మరింత షార్ప్‌గా చేశారు. సైడ్ ప్రొఫైల్ మాత్రం దాదాపు అదే విధంగా ఉంటుంది. కానీ ముందు డోర్ల దిగువ భాగంలో tata.ev బ్యాడ్జ్ కనిపిస్తుంది.

వెనుక భాగంలో ఎక్కువ మార్పులు

Punch EVలో ఎక్కువ డిజైన్ మార్పులు వెనుక భాగంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది పెట్రోల్ Punch మోడల్‌లాగే కనిపిస్తుంది. 

ఇందులో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. బంపర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 195 mmగా ఉంది. ఇది పాత మోడల్ కంటే 5 mm ఎక్కువ.

లోపల క్యాబిన్ - చిన్న ఫీచర్ అప్‌డేట్స్

క్యాబిన్ డిజైన్ ఎక్కువగా పాత మోడల్‌లానే ఉంటుంది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ అలాగే కొనసాగించారు.

ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ HVAC కంట్రోల్స్ ఉన్నాయి. కొత్తగా OTA అప్డేట్స్, 6 భాషల్లో వాయిస్ కమాండ్స్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇచ్చారు.

సేఫ్టీ - కొత్త హై బీమ్ అలర్ట్

సేఫ్టీ విషయంలో కూడా Punch EV బలంగా ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, ABS, EBD, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్తగా హై బీమ్ అలర్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు. నగరాల్లో రాత్రి డ్రైవింగ్ సమయంలో హై బీమ్ తగ్గించాలని డ్రైవర్‌కు ఇది గుర్తు చేస్తుంది.

మొత్తం చూస్తే, కొత్త Tata Punch EVలో డిజైన్ మార్పులు పెద్దగా లేకపోయినా పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్, ఫాస్ట్‌ ఛార్జింగ్ వంటి అప్‌గ్రేడ్‌లు వచ్చాయి. నగర ప్రయాణాలకు సరిపోయే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. దీంతో, ప్రస్తుతం సిటీల్లో ఈ కారుకు మంచి డిమాండ్‌ కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

కొత్త Tata Punch EV ధర ఎంత?

కొత్త Tata Punch EV ధర రూ.9.69 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

కొత్త Punch EV లో బ్యాటరీ ప్యాక్స్ ఏమిటి మరియు వాటి రేంజ్ ఎంత?

కొత్త Punch EV లో 30kWh (375 కి.మీ. రేంజ్) మరియు 40kWh (468 కి.మీ. రేంజ్) బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి.

కొత్త Punch EV ఛార్జింగ్ ఎంత వేగంగా ఉంటుంది?

కొత్త Punch EV 65kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, ఇది మునుపటి మోడల్ కంటే వేగంగా ఛార్జ్ అవ్వడానికి సహాయపడుతుంది.

కొత్త Punch EV లో ముఖ్యమైన డిజైన్ మార్పులు ఏమిటి?

బయటి డిజైన్ లో ముందు భాగంలో కనెక్టెడ్ LED లైట్ బార్ తొలగించబడింది మరియు వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ తో పెట్రోల్ Punch మోడల్ లాగా కనిపిస్తుంది.

కొత్త Punch EV లో కొత్త సేఫ్టీ ఫీచర్ ఏమిటి?

కొత్తగా హై బీమ్ అలర్ట్ ఫీచర్ జోడించబడింది, ఇది రాత్రి డ్రైవింగ్ సమయంలో హై బీమ్ తగ్గించమని డ్రైవర్ కి గుర్తు చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget