అన్వేషించండి

Tata Punch EV: టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌లో కొత్త '6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌' టెక్నాలజీ - దీనివల్ల మనకు ఇన్ని లాభాలు!

Tata Punch EV: టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌లో కొత్త '6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌' యూనిట్‌ వచ్చేసింది. సైజ్‌, బరువు తగ్గించి, ధర తగ్గించి, ఎఫిషియెన్సీ పెంచడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా పంచ్ EVలో 6-ఇన్-1 డ్రైవ్‌ట్రైన్ పరిచయం చేయబడింది.
  • ఇది ఈ-మోటార్, గేర్, ఇన్వర్టర్, కన్వర్టర్, PD, ఛార్జర్‌లను ఏకం చేస్తుంది.
  • ఈ ఇంటిగ్రేషన్ పరిమాణం, బరువు తగ్గించి, సామర్థ్యం పెంచుతుంది.
  • తయారీ ఖర్చు తగ్గి, వాహన ధర ఆకర్షణీయంగా మారుతుంది.

Tata Punch EV Motor: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. ఈ పోటీలో ముందంజలో ఉన్న కంపెనీ అంటే Tata Motors. తాజాగా అప్‌డేట్‌ చేసిన "టాటా పంచ్‌ ఈవీ"లో టాటా కొత్తగా పరిచయం చేసిన 6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌ ‍‌(Tata Punch EV’s new 6-in-1 EV drivetrain) ఇప్పుడు ఆటో రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇప్పటివరకు చాలా ఎలక్ట్రిక్‌ కార్లలో 3 ఇన్ 1 సిస్టమ్‌ ఉండేది. అంటే ఇ-మోటార్‌, రిడక్షన్‌ గేర్‌, ఇన్వర్టర్‌ను ఒకే యూనిట్‌గా కలిపి వాడేవారు. కానీ పంచ్‌ ఎలక్ట్రిక్‌లో టాటా దీనిని మరో లెవల్‌కు తీసుకెళ్లింది.

6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌లో ఏమేం ఉన్నాయి?

  • ఈ కొత్త యూనిట్‌లో
  • ఇ-మోటార్‌
  • రిడక్షన్‌ గేర్‌
  • ఇన్వర్టర్‌
  • DC-DC కన్వర్టర్‌
  • పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్‌ (PDU)
  • ఆన్‌బోర్డ్‌ చార్జర్‌

వీటన్నింటినీ ఒకే కాంపాక్ట్‌ యూనిట్‌గా అమర్చారు. దీని వల్ల వేర్వేరు భాగాలు, కనెక్షన్లు, కంట్రోలర్లు తగ్గాయి.

యూజర్లకు లాభం ఏమిటి?

ఈ కొత్త సిస్టమ్‌ వల్ల:

  • ప్యాకేజింగ్‌ సైజ్‌ 50 శాతం తగ్గింది
  • బరువు 28 శాతం తగ్గింది
  • ఎఫిషియెన్సీ 6 శాతం పెరిగింది
  • ఎలక్ట్రికల్‌ హార్నెస్‌లు, కనెక్షన్లు 30 శాతం తగ్గాయి
  • సెమీకండక్టర్లు 40 శాతం తక్కువగా వాడారు
  • సెమీకండక్టర్లు, హార్నెస్‌లు తగ్గడంతో తయారీ ఖర్చు తగ్గింది. ఈ కారణంగా పంచ్‌ ఎలక్ట్రిక్‌ ధరను కూడా మరింత ఆకర్షణీయంగా ఉంచగలిగింది.

బోనెట్‌ ఓపెన్‌ చేస్తే ఏం కనిపిస్తుంది?

పంచ్‌ ఎలక్ట్రిక్‌ బోనెట్‌ ఓపెన్‌ చేస్తే ఈ 6 ఇన్ 1 యూనిట్‌ క్రింద భాగంలో కాంపాక్ట్‌గా (తక్కువ స్థలంలోనే) అమర్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పై భాగంలో ఖాళీ స్పేస్‌ కూడా కనిపిస్తుంది. అయితే ఆ స్పేస్‌ను ఫ్రంక్‌గా ఇంకా విస్తరించలేదు. భవిష్యత్తులో టాటా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

భవిష్యత్తు ఇదేనా?

టాటా మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ కులకర్ణి చెప్పిన ప్రకారం, ఈ తరహా x ఇన్ 1 ఇంటిగ్రేషన్‌ అనేది భవిష్యత్తు దిశ. అయితే ప్రతి మోడల్‌కు అవసరాన్ని బట్టి యూనిట్ల సంఖ్య మారుతుంది. ఉదాహరణకు, రాబోయే "Tata Sierra EV"లో ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ ఉంటే, రెండు 6 ఇన్ 1 యూనిట్ల అవసరం ఉండకపోవచ్చు. ఒక యాక్సిల్‌కు 6 ఇన్ 1, మరో యాక్సిల్‌కు 4 లేదా 5 ఇన్ 1 యూనిట్‌ వాడే అవకాశం ఉంది.

లోపాలు కూడా ఉన్నాయి!

ఇలాంటి ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌లలో ఒక భాగంలో సమస్య వస్తే మొత్తం యూనిట్‌ మార్చాల్సి రావచ్చు. దీంతో సర్వీస్‌ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కానీ టాటా చెప్పే మాట ఏమిటంటే - భాగాలు తక్కువగా ఉండటం వల్ల సమస్యలు కూడా తక్కువగానే వస్తాయి. తయారీ క్లిష్టత తగ్గడంతో విశ్వసనీయత పెరుగుతుంది.

భవిష్యత్తులో, హై వోల్టేజ్‌పై నడిచే ఎలక్ట్రికల్‌ కంప్రెసర్‌ను కూడా ఈ సిస్టమ్‌లో కలపాలని టాటా ఆలోచిస్తోంది. అలా అయితే 6 ఇన్ 1 సిస్టమ్‌ మరింత పెద్ద ఇంటిగ్రేటెడ్‌ మాడ్యూల్‌గా మారే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌లో వచ్చిన ఈ 6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌ కేవలం టెక్నాలజీ అప్‌డేట్‌ కాదు. ధర తగ్గించడంలో, పనితీరు మెరుగుపరచడంలో, భవిష్యత్తు ఎలక్ట్రిక్‌ కార్ల దిశను నిర్దేశించడంలో ఇది కీలక అడుగు అని చెప్పాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

టాటా పంచ్ EV లో కొత్తగా 6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌ అంటే ఏమిటి?

ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, ఇందులో ఇ-మోటార్, రిడక్షన్ గేర్, ఇన్వర్టర్, DC-DC కన్వర్టర్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ (PDU) మరియు ఆన్‌బోర్డ్‌ చార్జర్‌ అన్నీ ఒకే యూనిట్‌గా అమర్చబడ్డాయి.

6 ఇన్ 1 డ్రైవ్‌ట్రైన్‌ వల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ప్యాకేజింగ్‌ సైజ్‌ 50% తగ్గింది, బరువు 28% తగ్గింది, ఎఫిషియెన్సీ 6% పెరిగింది, మరియు తయారీ ఖర్చు తగ్గడం వల్ల కారు ధర ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా?

ఒక భాగంలో సమస్య వస్తే మొత్తం యూనిట్‌ మార్చాల్సి రావచ్చు, ఇది సర్వీస్‌ ఖర్చును పెంచుతుంది. అయితే, భాగాలు తక్కువగా ఉండటం వల్ల సమస్యలు కూడా తక్కువగానే వస్తాయని టాటా పేర్కొంది.

భవిష్యత్తులో ఈ తరహా ఇంటిగ్రేషన్‌ ఉంటుందా?

అవును, టాటా మోటార్స్‌ ప్రకారం, ఈ తరహా x ఇన్ 1 ఇంటిగ్రేషన్‌ అనేది భవిష్యత్తు దిశ. అయితే, మోడల్‌ అవసరాన్ని బట్టి యూనిట్ల సంఖ్య మారుతుంది.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget