అన్వేషించండి

Mahindra Scorpio N లేదా Tata Harrier .. ఏ కారు కొంటే EMI ఖర్చు తక్కువ అవుతుంది?

Mahindra Scorpio vs Tata Harrier: మహీంద్రా స్కార్పియో, టాటా హారియర్ లలో ఏది కొనాలో క్లారిటీ రావడం లేదా.. అయితే వీటి ధర, ఫైనాన్స్ ప్లాన్, EMI చెల్లింపు వివరాలు తెలుసుకోండి.

టాటా హారియర్, మహీంద్రా స్కార్పియో N భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలుగా ఉన్నాయి. కంపెనీపై నమ్మకం, మంచి పనితీరు కారణంగా ఈ వాహనాల పట్ల అన్ని వర్గాల ప్రజలలో క్రేజ్ కనిపిస్తుంది. మహీంద్రా స్కార్పియో N పెట్రోల్,  డీజిల్ పవర్‌ట్రైన్‌లతో వస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా హారియర్ ఎస్‌యూవీ ధర రూ. 14 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 25.25 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెండు కార్లలో దేనిని కొనుగోలు చేయాలనే విషయంలో తేల్చేకోలేకపోతున్నారా.. అయితే పూర్తి పేమెంట్ కాకుండా ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటే, ఏ కారు EMI మీకు చౌకగా ఉంటుందో తెలుసుకుని కొనేయండి.

టాటా హారియర్ ఫైనాన్స్ ప్లాన్

టాటా హారియర్ అత్యంత చవకైన మోడల్ ధర రూ. 13.99 లక్షలకు వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు రూ. 12.60 లక్షల వరకు Loan పొందవచ్చు. ఇది ఎక్స్-షోరూమ్ ధరపై లభించే లోన్. ఒకవేళ మీరు 4 సంవత్సరాల కాలపరిమితికి వెహికల్ లోన్ తీసుకుంటే, ఈ లోన్ మీద 9 శాతం వడ్డీ అయితే.. అప్పుడు మీరు ప్రతి నెలా రూ. 31,400 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 5 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా సుమారు రూ. 26 వేల ఈఎంఐ చెల్లించాలి.

మహీంద్రా స్కార్పియో EMI ప్లాన్

బెస్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మహీంద్రా స్కార్పియో Nలో Z2 పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఈ కారు కొనుగోలు కోసం మీకు రూ. 14,19,167 (14 లక్షల 19 వేల నూట అరవై ఏడు రూపాయల) వరకు లోన్ లభిస్తుంది. మీరు కారు కొనుగోలు కోసం లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే, 4 సంవత్సరాల కాలపరిమితికి 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా సుమారు రూ. 37,323 చెల్లించాల్సి వస్తుంది. 

ఒకవేళ మీరు 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేసి, 4 ఏళ్ల కార్ లోన్‌పై 9.8 శాతం వడ్డీ కట్టాల్సి వస్తే.. మీరు ప్రతి నెలా రూ. 34,796 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 5 సంవత్సరాల టైంకు కార్ లోన్ తీసుకుంటే 9.8 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ. 23,532 వరకు చెల్లించాల్సి వస్తుంది. కనుక వాహనం కొనుగోలు చేయడానికి ముందు దాని ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర తెలుసుకోవడంతో పాటు మీ ఫైనాన్స్ ప్లాన్, ఈఎంఐ చెల్లించాల్సిన వివరాలు సరిగ్గా తెలుసుకోవాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

సుజుకి ఇ-యాక్సెస్ రేటు నుంచి రేంజ్ వరకు పూర్తి వివరాలు - కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన విషయాలివి
ఈ వివరాలు తెలియకుండా సుజుకి ఇ-యాక్సెస్ కొనొద్దు, ముందే షోరూమ్‌కు వెళితే నష్టపోతారు!
నిస్సాన్ గ్రావైట్‌ కొనాలనుకుంటున్నారా? సిటీలో, హైవేపై ఈ కారు నిజమైన మైలేజ్ వివరాలు ఇవిగో!
తక్కువ ధరలో 7-సీటర్‌ కారు - నిస్సాన్ గ్రావైట్‌ రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత? రోడ్‌ టెస్ట్‌లో అసలు ఫలితాలు
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
టాటా కర్వ్ బలాలు, బలహీనతలు - కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
స్టైలిష్‌ కార్‌ టాటా కర్వ్ కొనాలా? వద్దా? - కొనడానికి 4 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget