Today Horoscope in Telugu 29 April 2025:ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు - మేషం, తుల, కుంభం సహా 12 రాశుల ఏప్రిల్ 29 రాశిఫలం
Rashi Phalalu: మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య తదితర రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఏప్రిల్ 29 రాశిఫలం
మేష రాశి
ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఎవర్నీ అతిగా నమ్మొద్దు. కుటుంబ సభ్యులతో ఏదైనా ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. చేపట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. పని ప్రదేశంలో మీరు చురుకుగా ఉండాలి..మీ శత్రువులు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాలలో రోజు కొంత ఖర్చుతో కూడుకున్నది. మీ పని చాలా కాలంగా ఆగిపోయి ఉంటే అది పూర్తవుతుంది. వాహనాల కోసం వృధా గా ఖర్చు చేయాల్సి వస్తుంది.
వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారికి చాలా బిజీగా ఉంటారు. రోజంతా ఏదో ఒక పని గురించి మీ మనస్సుపై ఒత్తిడి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఆలోచిస్తూ ఉంటారు. పెరుగుతున్న ఖర్చు మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టుతుంది. ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంది ఓర్పుతో పనిచేయడం మీకు మంచిది. స్నేహితులు , దగ్గరి బంధువుల మాటలతో మీకు సంతోషం కలుగుతుంది. కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళే ప్రణాళిక కూడా ఉండవచ్చు.
మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆస్తి లాభం సూచన ఉంది. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు సాధించవచ్చు. దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. పని ప్రదేశంలో మీ ప్రభావం పెరుగుతుంది. సామాజిక రంగంలో గౌరవం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటలకు విలువిస్తారు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. పిల్లలతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
కర్కాటక రాశి
భాగస్వామ్యంలో ఏదైనా పని చేయడానికి ఈ రోజు కర్కాటక రాశి వారికి మంచిది, కానీ జీవిత భాగస్వామి తీరు మీకు తలనొప్పిగా మారవచ్చు. పిల్లలతో సమయం గడుపుతారు. గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. పని ప్రదేశంలో ఉన్న సమస్యలను పట్టించుకోకండి మీ పనిపై దృష్టి పెట్టండి. మీ వాహనం అకస్మాత్తుగా దెబ్బతినడం వల్ల మీ ఖర్చు పెరగవచ్చు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు పొదుపు పథకాలపై పూర్తి దృష్టి పెడతారు. అప్పులు చేయొద్దు
సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఏదైనా ధార్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుంది..రోజంతా ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులు , పరిచయస్తులతో సంతోషకరమైన క్షణాలను గడపడానికి అవకాశం ఉంటుంది. మీ మనసులో మాటలను ఎవరికైనా చెప్పడం ద్వారా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చట్టపరమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పులు తీసుకోవడం మానుకోండి.వైవాహిక జీవితానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి
కన్యా రాశి
ఈ రోజు కన్య రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి. మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో మీ ఆదాయం పెరుగుతుంది. వినోద కార్యక్రమాలను ఆనందిస్తారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటుంది. వ్యాపారంలో రేపు కొన్ని సాంకేతిక సమస్యలు రావడం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. ఏదైనా ప్రత్యేక పని వల్ల మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించబోతున్నట్లయితే అందులో మీరు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. సోదరులతో ఏదైనా వివాదం ఉంటే అది పరిష్కారమవుతుంది. దాంపత్య జీవితంలో విభేదం ఉండవచ్చు కానీ వెంటనే సమసిపోతుంది
వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారికి సంతోషకరమైన రోజు. ఏదైనా శుభ మరియు శుభకార్యక్రమంలో పాల్గొంటారు. భాగస్వామ్య పనిలో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ స్నేహితుడు మీతో పెట్టుబడి సంబంధిత ఏదైనా పథకం గురించి చెప్పవచ్చు కానీ డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ఆస్తికి సంబంధించిన పనుల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. సామాజిక రంగాలలో పనిచేసేవారి ప్రతిష్ట మరింత మెరుగవుతుంది. వ్యాపారం చేసేవారు కొత్త పని ప్రారంభించాలని ప్లాన్ చేయవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది. పిల్లల సంతోషం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య దూరం ఉంటే అది తొలగిపోతుంది, పరస్పర అనుబంధం మెరుగవుతుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది.
మకర రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం పొందడానికి చాలా కష్టపడాలి. విద్యార్థులు కొత్త పరిశోధనలో పాల్గొనవచ్చు. ఏదైనా పని వల్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొందరు స్నేహితులుగా ఉండి మీకు నష్టం చేస్తారు..అప్రమత్తంగా వ్యవహరించండి. చిన్న పిల్లలతో ఆటపాటల్లో కొంత సమయం గడుపుతారు. సాయంత్రం సమయం మీ వినోదంలో గడుస్తుంది.
కుంభ రాశి
సామాజిక రంగాల్లో పనిచేసే కుంభ రాశి వారికి ఈ రోజు మంచిది. మీ ప్రతిష్టను మెరుగుపరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. సామాజిక , రాజకీయ రంగాలతో సంబంధం ఉన్న వారి ప్రభావం పెరుగుతుంది. మీరు దూర ప్రయాణం చేయాలని సిద్ధమవుతున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు. ఇంట్లో ధార్మిక కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు.
మీన రాశి
ఈ రోజు మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం మరియు పనిలో ఏదైనా మార్పు చేయాలని అనుకుంటున్నట్లయితే నిపుణుల సలహాతో చేయవద్దు. నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు, ఉద్యోగులు శుభఫలితాలు పొందుతారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















