Rahul Dravid Standing Ovation Vaibhav Suryavanshi IPL 2025 | వైభవ్ ఆటకు లేచి గంతులేసిన ద్రవిడ్ | ABP Desam
రాహుల్ ద్రవిడ్ గురించి తెలిసిందేగా. ఆయన అంత త్వరగా ఎప్పుడూ ఎమోషన్స్ చూపించరు. ప్యూర్ జెంటిల్మన్ కళ్ల ముందు జరిగే వాటిని గమనించటం...తప్పొప్పులను పుస్తకంలో రాసుకోవటం ఇదే ఆయనలో మనం ఎప్పుడూ చూసేది. పైగా ద్రవిడ్ కి ఈ ఐపీఎల్ ముందు యాక్సిడెంట్ అయ్యింది. కాలు విరగటంతో ఈ సీజన్ అంతా ఆయన వీల్ ఛైర్ లో ఉండి కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు వాకింగ్ స్టిక్స్ సహాయంతో ఓ నాలుగు అడుగులు వేస్తున్నారు. అలాంటి ఆయన నిన్న తనను తాను మర్చిపోయారు. వైభవ్ సూర్యవంశీ అనే 14ఏళ్ల చిచ్చరపిడుగు గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ కొట్టి సూపర్ సెంచరీకి మురిసిపోయారు రాహుల్ ద్రవిడ్. తన నమ్మకం నిజమైందనే ఆనందం...ఓ చిన్న పిల్లాడు సూపర్ స్టార్ ని పుట్టుకొచ్చానంటూ తనకు తాను ఇచ్చిన ఆ స్టేట్మెంట్ చూసి సంబరపడిపోయారు. సూర్యవంశీ సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకోగానే తనకు కాలుకి యాక్సిడెంట్ అయ్యిందని తను లేచి నిలబడలేననే విషయాన్ని మర్చిపోయారు. జప్పున లేచి నిలబడ్డారు. కాలు బాగా లేకపోవటంతో ఓ పక్కకు వెంటనే ఒరిగిపోయారు. అయినా కానీ పర్లేదు మళ్లీ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఓ రకంగా సింహ గర్జన చేశారు. ఓ ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుని సానపెట్టడం కాదు తను సాన పట్టిన వజ్రం వజ్రాయుధంలా మారి గ్రౌండ్ లో ఓ పెను విధ్వంసమే సృష్టిస్తుంటే ఓ గురువుకు మాత్రం గర్వకారణం కాదు. ఓ ప్రౌడ్ నెస్ అండ్ వైల్డ్ నెస్ కనపడింది నిన్న ద్రవిడ్ సర్ ఫేస్ లో.





















