Single Trailer: వాళ్లు లేడీస్‌రా.. వాళ్లు చావరు మనల్ని చంపుతారు - ఆకట్టుకునేలా శ్రీవిష్ణు '#సింగిల్' ట్రైలర్
Sree Vishnu: శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ '#సింగిల్' నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిశోర్, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్స్ అదిరిపోగా.. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Sree Vishnu's Single Movie Trailer Released: యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) లేటెస్ట్ మూవీ 'సింగిల్' (#Single). ఈ సినిమాకు 'నిను వీడని నీడను నేనే' ఫేం కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేసింది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా '#సింగిల్' మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. 'అమ్మాయిలను పడేయాలంటే మూడుదార్లురా..' అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా ఆసక్తిని పెంచేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందింది. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్స్, పంచ్ డైలాగ్స్ అదిరిపోయాయి. 'వాళ్లు లేడీస్‌రా.. అంటే కాక్రోచ్స్. వాళ్లు చచ్చిపోరు. మనల్ని చంపుతారు.', 'ఓ మగాడు అమ్మాయిని ప్రేమిస్తే వాడి బతుకు మంచు కురిపిపోతుంది.' అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిరిగిందో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
మీ అందరి కోరిక మేరకు మీ #Single Trailer😉https://t.co/ei1Yn2mAGZ#SingleMovie On May 9th In Theatre's 🤗 pic.twitter.com/OSskB9zUVR
— Sree Vishnu (@sreevishnuoffl) April 28, 2025
మే 9న రిలీజ్
ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పగటిపూట కేర్ ఫ్రీ ఫ్రెండ్, రాత్రి వేళల్లో రొమాంటిక్ వ్యక్తిగా కనిపించనున్నారు.
బుల్లిరాజు కామెడీ..
ఈ మూవీలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఫేం బుల్లిరాజు సందడి చేయనున్నారు. ఓ వైపు వెన్నెల కిశోర్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్స్, పంచెస్ అదరగొట్టనుండగా.. బుల్లిరాజు కామెడీ సైతం ఎంటర్‌టైన్ చేయనుంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు.
హిట్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన డిఫరెంట్ స్టైల్‌లో మూవీస్ చేస్తున్నారు శ్రీ విష్ణు. ఆయన లాస్ట్ మూవీ 'శ్వాగ్' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు '#సింగిల్' మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.






















