Alekhya Chitti Pickles: బిగ్ బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ - ఆ వీడియోతో క్లూ ఇచ్చేసినట్టేనా.. మరి నిజమెంత?
Alekhya Chitti: ప్రస్తుతం ఎవరి నోట విన్నా ట్రెండ్ అవుతున్న మాట 'అలేఖ్య చిట్టి పికెల్స్'. వీరిలో ఓ సిస్టర్ ప్రముఖ రియాల్టీ షో 'బిగ్ బాస్'లో అవకాశం దక్కుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Alekhya Chitti Sisters May Contested In Bigg Boss Telugu Season: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరైనా ఉన్నారంటే వారు 'అలేఖ్య చిట్టి పికెల్స్' (Alekhya Chitti Pickles) సిస్టర్స్. గత 4 రోజులుగా నెట్టింట వీరిపై ఒకటే ట్రోల్స్, మీమ్స్, క్లారిఫికేషన్ వీడియోస్, అపాలజీ వీడియోస్. చాలాకాలంగా పచ్చళ్ల వ్యాపారం చేస్తూ కస్టమర్లపై బూతులతో విరుచుకుపడడంతో వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
బిగ్ బాస్‌లోకి ఓ సిస్టర్
ఈ క్రమంలోనే ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్‌లో (Bigg Boss) అలేఖ్య చిట్టి, రమ్య సిస్టర్స్‌లో ఒకరికి ఛాన్స్ వస్తుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే కొన్ని నెలల్లో ప్రారంభం కానుండగా.. ప్రతి ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక, బిగ్ బాస్ ప్రోగ్రాం నిర్వహణ పనుల్లో టీం ఉంది.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారికి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు బిగ్ బాస్ ఎంట్రీ దక్కుతుంది. 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌పై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు 100 మిలియన్స్‌కు పైగా వీడియోలతో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని నెట్టింట చర్చ సాగుతోంది.
Also Read: 'అలేఖ్య చిట్టి పికిల్స్'ను వాడిన సారంగపాణి... పచ్చళ్ల బిజినెస్ పెడతానన్న ప్రియదర్శి
ఆ ఛాన్స్ ఆమెకేనా..?
'అలేఖ్య చిట్టి పికెల్స్' సిస్టర్స్‌లో రీల్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రమ్యకే ఆ అవకాశం ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. మోడ్రన్ డ్రెస్సుల్లో ఆమె చేసిన రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుండడమే దీనికి కారణమని చెబుతున్నారు. తాజాగా, జియో హాట్ స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించి ఓ సీన్ సైతం వీడియో షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమాలో ఓ సీన్‌తో వీడియో విడుదల చేశారు. తాజాగా, బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ విషయంపై స్పందించారు. వారిలో ఒకరు బిగ్ బాస్‌కు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసలెవరీ సిస్టర్స్.. ఎందుకిలా..?
రాజమండ్రి వేదికగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' పేరుతో ముగ్గురు సిస్టర్స్ సుమ కంచర్ల, అలేఖ్య చిట్టి, రమ్య మోక్ష కంచర్ల (రమ్య గోపాలకృష్ణ) సోషల్ మీడియాలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించారు. వీరిలో రమ్య తన రీల్స్‌తోనూ పాపులర్ అయ్యారు. తమను విమర్శించిన వారిపై అంతేస్థాయిలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు సైతం చేశారు. అయితే పచ్చళ్లు ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు వీరిలో ఓ అమ్మాయి అలేఖ్య అతనిపై బూతులతో విరుచుకుపడింది.
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో తమను కూడా అలానే తిట్టిందంటూ మరిన్ని ఆడియో లీక్స్ బయటకు వచ్చాయి. దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ట్రోలింగ్ మొదలైంది. అంత దారుణంగా ఎలా తిడతారంటూ కామెంట్స్ చేశారు. దీంతో అక్క సుమ కంచర్ల తాను తిట్టలేదని.. తనను ట్రోల్ చెయ్యొద్దని వేడుకున్నారు. ఈ అంశంపై వివాదం ముదురుతున్న వేళ అలేఖ్య ఎట్టకేలకు సారీ చెప్పారు. తాను తప్పు చేశానని.. తాను ఎవరినైతే ఇప్పటివరకూ తిట్టానో వాళ్లందర్నీ సారీ అడుగుతున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. దీంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లే అనిపిస్తున్నప్పటికీ ఇంకా ట్రోలింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది.






















