అన్వేషించండి

Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ఏడున్నర గంటల పాటు సిట్ బృందం ప్రశ్నించింది.గతంలో కొంత మంది ఇచ్చిన వాంగ్మూలాలపై ఆయనను పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది.

SIT team questioned Harish Rao for seven Hours: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు దాదాపు ఏడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ,ఇటీవల విచారణ ఎదుర్కొన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఓ టీవీ చానల్ ఎండీ  ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించారు.       

Image    

ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా హరీష్ రావుపై ప్రశ్నలు              
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంటెలిజెన్స్ అధికారులతో మీకు ఉన్న సంబంధం ఏమిటి? ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా? అన్న కోణంలో ప్రధానంగా ప్రశ్నలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ,  ఆ సమయంలో జరిగిన కాల్ డేటా సేకరణపై హరీష్ రావును అధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది. 

Image           

అంతా చట్టబద్ధంగానే జరిగిందని హరీష్ చెప్పినట్లు ప్రచారం                                 
 
సిట్ ప్రశ్నలకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.   పదేళ్లలో మేము చట్టానికి లోబడే పనిచేశాం, ఏ అధికారికి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వలేదు  అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇతర నిందితుల వాంగ్మూలాలను ఉటంకించినప్పుడు.. వారిపై ఒత్తిడి తెచ్చి లేదా ప్రలోభపెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఉండవచ్చు అని ఆయన కొట్టిపారేసినట్లు చెబుతున్నారు.        

Image

డైవర్షన్ కోసమేనని హరీష్ ఆరోపణలు      

విచారణకు వెళ్లే ముందు ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని తాను బయటపెట్టినందుకే ఈ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సహకరిస్తామని చెప్పారు. అయితే, హరీష్ రావు ఇచ్చిన సమాధానాలపై సిట్ అధికారులు సంతృప్తి చెందారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన సమాధానాలను ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలతో సరిపోల్చిన తర్వాత, సిట్ మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.              

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget