Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?
గతేడాది ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుని ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆట ఈ సీజన్ లో అత్యంత దారుణంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కేకేఆర్ విఫలమవుతున్నా ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. 8 మ్యాచుల్లో 3హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒక్కటంటే ఒక్కసారి డకౌట్ అవ్వలేదు. కనీసం సింగిల్ డిజిట్ స్కోరుతోనూ వెనుతిరిగలేదు. నిన్న కూడా గుజరాత్ టైటాన్స్ భారీ తేడాతో కేకేఆర్ ను చిత్తు చేసిన మ్యాచ్ లోనూ అజింక్యా రహానే ఒక్కడే ఆడాడు. 199 పరుగుల లక్ష్య చేధనలో మిగిలిన టీమ్ అంతా చేతులెత్తేస్తున్నా 36 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ తో 50 పరుగులు చేశాడు రహానే. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బట్లర్ చేతిలో స్టంప్ అవుట్ అయ్యాడు. అయితే రహానే బ్యాటింగ్ టెస్ట్ మ్యాచ్ లను తలపిస్తోందని వేగంగా ఆడాలి టార్గెట్ ఫినిష్ చేయాలనే ఇంటెన్షన్ తో రహానే కనిపించటం లేదని కొంత మంది కేకేఆర్ హార్డ్ కోర్ అభిమానుల ఆవేదన. కానీ నిన్నటి మ్యాచే ఉదాహరణ తీసుకున్నా కేకేఆర్ టీమ్ లో భారీ భారీ హిట్టర్లున్నారు. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రస్సెల్, మొయిన్ అలీ, రఘువంశీ, రమణ్ దీప్ ఇంత మంది ఉన్నా వాళ్లందరూ మూకుమ్మడిగా ఫెయిల్ అయితే రహానేను టార్గెట్ చేయమని ఫ్యాన్స్ వాదన. ఏదేమైనా ఈ సీజన్ లో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదో పరజయం రావటానికి రహానే కారణమని అతనిలో మునుపటి దూకుడు లేదని తెగ ట్రోల్ చేస్తున్నారు పాపం. వాస్తవానికి రహానేను చూసి జాలిపడాలి. తనకు శక్తికి మించి ఆడుతున్నా మిగిలిన టీమ్ సహకారం లేకపోవటంతో మ్యాచ్ లు ఓడిపోతున్నాడు. బ్యాడ్ లక్.





















