అన్వేషించండి

Flights Cancel: యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో ఇతర ఎయిర్ లైన్స్ తమ విమానాలు రద్దు చేసింది.

న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ దేశంపై చేపట్టిన ఆపరేషన్‌తో మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళం నెలకొంది. రెండు దేశాలు ఒకేసారి ఇరాన్ మీద డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో చాలా దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌లను మూసివేశాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. వెస్ట్ ఆసియాలో అందుబాటులో ఉన్న ఎయిర్‌స్పేస్‌లో ప్రత్యామ్నాయ మార్గాలను వాడుకుని ఉత్తర అమెరికా, యూరప్‌లకు విమానాలను నడుపుతామని ఎయిర్ ఇండియా తెలిపింది. 

ఎయిర్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం (మార్చి 2) నాడు యూరప్‌లోని అనేక నగరాలకు ఆరు విమానాలు రద్దు చేశారు. విమానయాన సంస్థ ఆదివారం సైతం 50 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్‌లకు వెళ్లే అన్ని విమానాలు మార్చి 2 రాత్రి 11:59 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిలిపివేయనున్నట్లు వారు తెలిపారు.
 
ఈ రోజు ఏయే విమానాలు రద్దు 
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఆదివారం నాడు ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. అమృత్‌సర్- బర్మింగ్‌హామ్ (AI 117) , బర్మింగ్‌హామ్-ఢిల్లీ (AI 114)తో సహా 6 విమానాలు సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనితో పాటు ఢిల్లీ, జ్యూరిచ్‌ల మధ్య AI 151, AI 152 విమానాలు, అలాగే ఢిల్లీ నుంచి కోపెన్‌హాగెన్‌ల మధ్య AI 157, AI 158 విమానాలు కూడా సోమవారం నాడు రద్దు చేసింది.

 పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నాం - ఎయిర్ ఇండియా
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. అనిశ్చితి, దాడులు కొనసాగుతున్న కారణంగా విమానాల నిర్వహణ సాధ్యం కాదని.. త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ప్రభావితమైన ప్రయాణికులకు వారి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌లకు అవసరమైన సమాచారం పంపుతున్నట్లు పేర్కొంది. ఎయిర్‌లైన్ రీ-బుకింగ్, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లలో కూడా సహాయం చేస్తోంది. ప్రయాణికులు తమ విమానాల తాజా సమాచారం కోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 24×7 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తామని,  ఎప్పటికప్పుడు అవసరమైన అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

మిడిల్ ఈస్ట్, దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎక్స్ లో పోస్ట్ తెలిపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్ లైన్స్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న దేశాలు, వాటి మీదుగా వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నాయి. గగనతలం మూసివేత ఒక కారణం అయితే, ఎయిర్ స్ట్రైక్స్ మరో కారణమని విమానయాన సంస్థలు తెలిపాయి. ఈ సమయంలో చాలా మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలుసు, ప్రతి నిర్ణయం ఆలోచించి, సురక్షితంగా తీసుకుంటున్నామని మేం ప్రయాణికులకు హామీ ఇస్తున్నామని పేర్కొంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget