అన్వేషించండి

ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?

2026 మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఏ సమయంలోగా పూర్తిచేయాలి? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి? ఈ వివరాలు తెలుసుకోండి...

ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
 
2026 మార్చి 3 సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclips)..దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు

భారతదేశంలో టైమింగ్స్ ప్రకారం

గ్రహణం ప్రారంభం (Eclipse Begins) మధ్యాహ్నం 3.20

సంపూర్ణ దశ ప్రారంభం (Totality Starts) సాయంత్రం 4 గంటల 34 నిముషాలు
 
గ్రహణం సంపూర్ణ దశ ముగింపు (Totality Ends) సాయంత్రం 5 గంటల 33 నిముషాలు
 
గ్రహణం పూర్తి ముగింపు (Eclipse Ends) సాయంత్రం 6 గంటల 48 నిముషాల వరకు
 
భారతదేశంలో ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో చంద్రుడు సాయంత్రం 6 గంటల తర్వాతే ఉదయిస్తాడు..అందుకే మనకు గ్రహణం చివరి భాగమే కనిపిస్తుంది. అంటే సాయంత్రం 6.20 నుంచి 6.48 వరకు ఉంటుంది. 

భోజనం ఎప్పుడు పూర్తిచేయాలి

సాధారణంగా చంద్రగ్రహణం సూతకాలం గ్రహణ సమయానికి 9 గంటల ముందు నుంచి మొదలవుతుంది.. సూర్య గ్రహణానికి సూతకాలం గ్రహణ సమయానికి 12 గంటల ముందు నుంచి మొదలవుతుంది. అందుకే మధ్యాహ్నం 12 దాటేలోగా భోజనం చేయాలని చెబుతున్నారు పండితులు. అనారోగ్య సమస్యలున్నవారు గ్రహణ సమయానికి 3 గంటల ముందు భోజనం పూర్తిచేయొచ్చు. ముఖ్యంగా గ్రహణం రోజు అన్నం, రోటీ కన్నా.. పండ్లు, పాలు తీసుకోవడం ఉత్తమం అని చెబుతారు. 

మార్చి 3 చంద్రగ్రహణం రోజు పట్టుస్నానం 3 గంటల 20 నిముషాలు

గ్రహణం విడుపు స్నానం సాయంత్రం 6 గంటల 48 నిముషాల తర్వాత..

స్నానం పూర్తైన తర్వాత ఇల్లు శుభ్రం చేసి..దేవుడి దగ్గర దీపం వెలిగించి అప్పుడు వంట చేసుకుని తినాలి

గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు

గ్రహణం సమయంలో జపం, ధ్యానం, దేవుడి పూజ, గాయత్రి మంత్రం, శివుడు విష్ణువు స్తోత్రాలు చదవడం మంచిది
 
గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది
 
గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని, పాత్రలు, దేవుడి మందిరాన్ని  శుభ్రం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి
 
సంప్రదాయాన్ని కచ్చితంగా పాటించాలి అనుకుంటే మధ్యాహ్నంన 12 లోపే భోజనం ముగించండి.. ఆ తర్వాత గ్రహణ సమయం ముగిసేవరకూ ఏమీ తీసుకోవద్దు

జపం చేస్తే విశేష ఫలితం


గ్రహణం (సూర్య లేదా చంద్ర గ్రహణం) సమయంలో విశ్వశక్తులు అస్థిరంగా ఉంటాయి..ఈ సమయంలో రాజస ,  తామస శక్తులు విజృంభిస్తాయి. అందుకే ఆలయాలను మూసివేస్తారు. అయితే మంత్ర సాధన చేసేవారికి ఈ సమయం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో చేసే జపం తక్కువసార్లు చేసినా కానీ అనంత ఫలితాన్నిస్తుంది, శీఘ్రసిద్ధిని ఇస్తుందని నమ్ముతారు. అందుకే గ్రహణ సమయంలో జపించిన సంఖ్యతో సంబంధం లేదు లక్ష జపంతో సమానం అని నమ్ముతారు. ఇది సాధకులకు వరం అనే చెప్పాలి. గ్రహణం ప్రారంభమైన వెంటనే పట్టుస్నానం పూర్తిచేసి నది, సముద్రతీరం లేదంటే ఇంటివద్ద అయినా జపం చేయొచ్చు. జపం ప్రారంభించడానికి ముందు ప్రాణాయామం పూర్తిచేయాలి. సంకల్పం చెప్పుకుని జపం ప్రారంభించాలి. గ్రహణం పూర్తయ్యేవరకూ జపం చేయాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

తులా రాశి ఆగస్టు 16-22 వారఫలం
తులా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
కన్యా రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget