అన్వేషించండి

Lunar Eclipse 2026 Date: తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణ సమయం, సూచనలు! ఏ రాశులవారిపై గ్రహణ ప్రభావం ఉంటుంది?

Lunar Eclipse 2026 Date and Time: ఫాల్గుణ శుక్లపూర్ణిమ మార్చి 03 న ఏర్పడుతోంది. ఈ గ్రహణం భారత్ లో కనిపిస్తుందా? తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ సమయం ఎంత? పూర్తివివరాలు ఇక్కడ తెలుసుకోండి

Lunar Eclipse 2026 Date:  ఫాల్గుణ శుక్లపూర్ణిమ సంపూర్ణ చంద్ర గ్రహణం 2026 మార్చి 03 మంగళవారం ఏర్పడుతోంది.  పంచాంగం ప్రకారం గ్రహణ సమయం, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

సంపూర్ణ చంద్ర గ్రహణం గ్రహణం  స్పర్శకాలం - మధ్యాహ్నం గం॥ 3.19 ని॥  

సంపూర్ణ చంద్ర గ్రహణం నిమీలనకాలం - 4.33 

సంపూర్ణ చంద్ర గ్రహణం మధ్యకాలం - 5.03 
  
మార్చి 3  సూర్యస్తమయ సమయం - 6 గంటల 2 నిముషాలు

మార్చి 3 చంద్రోదయ సమయం -  6 గంటల 4 నిముషాలకు
 
సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్మీలన కాలం - 5.32 
 
సంపూర్ణ చంద్ర గ్రహణం మోక్షకాలం - 6.46
 
సంపూర్ణ చంద్ర గ్రహణం బింబ దర్శనకాలం - 59 నిముషాలు

చంద్రగ్రహణ సమయం 42 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సంపూర్ణ  చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే బింబం కనిపిస్తుంది. అందుకే సూర్యాస్తమయం సమయం అయిన 6 గంటల 2 నిముషాలకు పట్టుస్నానం.. 6 గంటల 46 నిముషాలకు విడుపుస్నానం చేయాలి. గ్రహణం ప్రారంభమైన 3 గంటల 19 నిముషాల నుంచి స్నానం  చేయాల్సిన అవసరం లేదు.  అయితే భోజనం మధ్యాహ్నం 12 గంటల లోపు ముగించేయడం మంచిది
 
మార్చి 3న ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రం, సింహరాశిలో సంభవిస్తోంది. అందుకే పుబ్బ నక్షత్రం వారు, సింహరాశివారు ఈ గ్రహణం చూడరాదు. ఉత్తర గోళం, అపసవ గ్రహణం, కేతుగ్రస్తం, నీలపింగళవర్ణం, మిశ్రమవర్ణంలో ఉంటుంది. ఈ గ్రహణం తూర్పు దిక్కున ప్రారంభమై.. తూర్పు ఆగ్నేయంలో నిమీలనం... దక్షిణ నైరుతిలో ఉన్మీలనం చెంది పశ్చిమం దగ్గర మోక్షం కలుగుతుంది. మనకు స్పర్శ, నిమీలనం, ఉన్మీలనములు కన్పించవు. మోక్షకాలమే దర్శనమిస్తుంది. 

సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తైన తర్వాత 6 గంటల 46 నిముషాలు దాటిన తర్వాత ఆహారం తీసుకోవాలి. గర్భిణిలు సాయంత్రం 5 గంటల నుంచి  6.46 వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

ఏ రాష్ట్రంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఎంత సేపు కనిపిస్తుంది?

మార్చి 3న ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఈశాన్యరాష్ట్రాల్లో కనిపిస్తుంది. ముంబైలో చంద్రోదయం సా.6.45 పశ్చిమ ప్రాంతములందు కన్పించదు. మోక్షకాలంలోనూ గ్రహణం అక్కడ కనిపించదు. లక్షద్వీపంలోని కవరత్తీ, గుజరాత్ లో ద్వారకలో ఈ గ్రహణం కనిపించదు. కర్ణాటక రాష్ట్రం మంగుళూరులో 8 నిముషాలు, అహ్మదాబాద్లో 3 నిముషాలు, గాంధీనగర్ లో 3 నిముషాలు, పనాజీలో 7 నిముషాలు, శృంగేరీలో 11 నిముషాలు, ఉదయపూర్లో 8 నిముషాలు, గుజరాత్ వడోదరాలో 5 నిముషాలు కనిపిస్తుంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం సమయం

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సంపూర్ణ చంద్రగ్రహణం  హైదరాబాద్ లో 24 నిముషాలు, విజయవాడలో 36 నిముషాలు, నల్గొండలో  27 నిముషాలు, నెల్లూరులో 28 నిముషాలు కనిపిస్తుంది
 
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయాలు ఉదయం నుంచి మూసివేసి మోక్షకాలం తర్వాత తెరిచి సంప్రోక్ష్య కార్యాలు నిర్వహిస్తారు.  

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
 
మేష రాశి - మానసిక అశాంతి

వృషభ రాశి - సుఖం

మిధున రాశి - లాభం

కర్కాటక రాశి - వ్యయం

సింహ రాశి- ఘాతం

కన్యా రాశి - హాని

తులా రాశి - ధనలాభం

వృశ్చిక రాశి - వ్యధ

ధనస్సు రాశి - చింత

మకర రాశి-  సౌఖ్యం

కుంభ రాశి - స్త్రీ కష్టం

మీన రాశి - అతి కష్టం 

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవరాత్రి Day 6 - మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ - విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి!
నవరాత్రి Day 6 - మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ - విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి!
16-10-2026 మూల నక్షత్రం సరస్వతీ అలంకారం! ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి!
16-10-2026 మూల నక్షత్రం సరస్వతీ అలంకారం! ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
15-10-2026 గురువారం మకర, కుంభ, మీన రాశుల వారికి శుభవార్తలా? సవాళ్లా?
15-10-2026 గురువారం మకర, కుంభ, మీన రాశుల వారికి శుభవార్తలా? సవాళ్లా?

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Embed widget