అన్వేషించండి

దేవుడికి ఆకలి వేస్తుందా? గ్రహణ సమయంలోనూ ఈ ఆలయాలు ఎందుకు తెరిచి ఉంటాయ్?

Lunar Eclipse 2026 Temples : గ్రహణం అనగానే అన్ని ఆలయాల తలుపులు మూసేస్తారు.. గ్రహణం పూర్తైన తర్వాత శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే గ్రహణం సమంలోనూ కొన్ని ఆలయాలు మూసివేయరు...

Temples: గ్రహణం రోజు..సూతకాలం ప్రారంభం అయినప్పటి నుంచీ ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి...అప్పుడు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ కొన్ని ఆలయాలు ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ఎందుకంటే గ్రహణం సమయంలోనూ ఇక్కడ ఆలయాలు తెరిచే ఉంటాయ్. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
 
తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం 

కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువరప్పు ఆలయంలో కొలువైన కృష్ణుడికి చాలా ఆకలట. ఇక్కడ రోజుకి 10సార్లు నైవేద్యం సమర్పిస్తారు. గ్రహణం అని గుడి మూసేస్తే..స్వామివారు ఆకలికి తట్టుకోలేరని, విగ్రహం సన్నబడిపోతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ గ్రహణం సమయంలోనూ గుడిని మూసివేయరు..నైవేద్యం సమర్పిస్తారు. 

లక్ష్మీనాథ్ ఆలయం 

రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం కూడా గ్రహణం సమయంలో మూతపడదు.  ఒకప్పుడు ఈ ఆలయాన్ని గ్రహణం రోజున  మూసేశారట. అప్పుడు స్వామివారు...ఆలయం పక్కనే ఉన్న మిఠాయి దుకాణ వ్యాపారి కలలో కనిపించి చాలా ఆకలిగా ఉంది నైవేద్యం పెట్టమని అడిగారట. ఆ కలను ఆలయ పూజారులకు చెప్పడంతో..అప్పటి నుంచి గ్రహణ సమయంలోనూ ఆలయాన్న మూసివేయకుండా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు

శ్రీకాళహస్తి 

శ్రీకాళహస్తిలో పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగగా కొలువయ్యాడు శంకరుడు. ఇక్కడ వాయులింగేశ్వరుడు 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. గ్రహాలను శాసించే స్వామికి గ్రహణం దోషం అంటుతుందా? అందకే శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలో రాహు కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

అరుణాచలం

కొండనే శివస్వరూపంగా, అగ్నిలింగంగా భావించే ప్రదేశం అరుణాచలం. నిత్యం భక్తులతో కళకళలాడే అరుణాచలం పౌర్ణమి వేళ మరింత రద్దీగా ఉంటుంది. అందుకే గ్రహణం అయినా కానీ అరుణాచలం ఆలయాన్ని మూసివేయరు. ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి
 
మహాకాళేశ్వర ఆలయం 

ఉజ్జయినిలో కొలువైన, కాలానికి అతీతుడైన మహాకాళుడికి గ్రహణ ప్రభావం ఉండదని చెబుతారు పండితులు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో గ్రహణం సమయంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి
 
ఉత్తరాఖండ్ లో ఉన్న కల్పేశ్వర్ ఆలయాన్ని కూడా గ్రహణం సమయంలో మూసివేయరు
  
ఢిల్లీలో ఉండే కల్కాజీ ఆలయంలో కొలువైన కల్కా దేవిని కాలచక్రానికే అధిపతిగా పూజిస్తారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయని అందుకే గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై ఉండదని చెబుతారు

గయలో ఉన్న విష్ణుపాద ఆలయంలో గ్రహణ సమయంలో పిండప్రదానం చేస్తారు కొందరు. అందుకే ఈ ఆలయాన్ని గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచుతారట 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

వృషభ రాశివారికి పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందా? 2026 ఉగాది పంచాంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget