Ugadi Panchangam (2026-2027): పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి ఫలాలు! ధనం, గౌరవం, విజయం మీ సొంతం!
Parabhava Nama Samvatsara Panchangam: శ్రీ పరాభవ నామసంవత్సరంలో కర్కాటక రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయి? ఏ గ్రహం అనుకూలం? ఏ గ్రహం ప్రతికూలం? 2026 - 2027 వార్షిక ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Karkataka rashi parabhava nama samvatsaram phalitalu 2026 2027
కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి , ఆశ్లేష
ఆదాయం - 2 వ్యయం 11 రాజపూజ్యం 4 అవమానం 7
కర్కాటక రాశివారికి ధనం, విద్య, సంపత్తు, బుద్ధి, సంతాన కారకుడు అయిన గురుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఇతరగ్రహాలు బలంగా ఉండడంతో ఎంత కష్టం ఎదురైనా ఈజీగా ఒడ్డుకు చేరుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. మీలో శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులు కలిసొస్తాయి.నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాలవారికి జీవన వృద్ధి ఉంటుంది. ఊహించని అభివృద్ధి ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలుంటాయు. వాహనప్రమాదాలు పొంచి ఉన్నాయ్ జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువుల నుంచి అనుకూలత, నూతన బంధాలు, జీనవ రంగంలో ఆధిక్యత, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ప్రశాంతంగా ఉంటారు, గతంలో వివాదాల కారణంగా విడిపోయిన భార్యభర్త కలుస్తారు. జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఉద్యోగులకు
ఈ ఏడాది ఈ రాశి ఉద్యోగులకు మంచి యోగకాలం. కేంద్రరాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి.
గదాయక మైనకా లందు పనిచేయువారికి ప్రమోషన్తో కూడినబదిలీలు, ఇంక్రిమెంట్లు, అధికారుల మన్ననలు లభించును. చిన్న, పెద్ద అన్ని రకాల ఉద్యోగులకు లాభమే. పర్మినెంటు కానివారికి ఈ ఏడాది పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి యజమానుల నుంచి గుర్తింపు లభిస్తుంది
కర్కాటక రాశి వ్యాపారులకు
పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వ్యాపారులకు గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు. అన్ని రకాల వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొత్త వ్యాపార ప్రారంభాలకు మంచిది. హోల్సేల్ , రిటైల్ంగంలో వారికి యోగం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. విలువైన స్థలాలు కొంటారు, కాంట్రాక్ట్ రంగంలో ఉండేవారికి లాభం
కర్కాటక రాశి వ్యవసాయదారులకు
ఈ రాశి వ్యవసాయదారులకు పరాభవ నామ సంవత్సరం రెండు పంటలు కలిసొస్తాయి. ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీర్చుతారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కౌలుదార్లు లాభపడతారు. చేపలు - రొయ్యల చెరువుల వారికి గతేడాది కన్నా ఆదాయం పెరుగుతుంది.
కర్కాటక రాశి కళాకారులకు
ఈ రాశి కళాకారులకు పరాభవ నామ సంవత్సరం మంచి కాలం. గురు, శని ప్రభావంతో అన్ని అనవకాశాలు కలిసొస్తాయి. ఇండస్ట్రీలో ఉండేవారు మంచి అవకాశాలు పొందుతారు. టీవీ, సినిమా రంగంలో ఉండేవారు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి
కర్కాటక రాశి విద్యార్థులకు
పరాభవ నామ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో 5 ఉత్తీర్ణులవుతారు. విద్యపై ఆసక్తి, చెడుస్నేహాలకు దూరంగా ఉంటారు. ఇంజనీరింగ్, మెడికల్, ఇసెట్, ఆసెట్, ఐసెట్, బి.ఇడి., లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు.
కర్కాటక రాశి క్రీడాకారులకు పరాభవ నామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జాతీయ అంతర్జాతీయజట్లలో స్థానం దక్కించుకుంటారు
కర్కాటక రాశి రాజకీయ నాయకులు
ఈ రాశి రాజకీయ నాయకులకు మంచి సమయం. ప్రజల నుంచి ఆదరణ, అధిష్టానం నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పార్టీలో మంచి పదవులు పొందుతారు. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నా..ఖర్చులు తప్పవు.
కర్కాటక రాశి స్త్రీలకు
ఈ రాశి స్త్రీలకు ఈ ఏడాది పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. కుటుంబంలో అంతా మీ మాటకు విలువనిస్తారు. భార్య భర్త మధ్య సరైన అవగాహన ఉంటుంది. అంతా మీ మాట ప్రకారం నడుచుకుంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు, ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి. గర్భిణి స్త్రీలకు శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం ఉంటుంది.
ఓవరాల్ గా.. కర్కాటక రాశివారికి పరాభవ నామ సంవత్సరం అత్యంత యోగకాలం. ఈ ఏడాది మీరు ఊహించనంత గొప్పగా జీవిస్తారు. గతంలో ఎన్నడూ లేనంత సుఖంగా ఉంటారు. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి
మీపై అందరకీ ఈర్ష్య, అసూయ, ద్వేషం, నరఘోష ఎక్కువగా ఉంటుంది..మంగళవారం, శనివారం నియమాలు పాటించడం మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి రాసిన వివరాలు ఇవి. ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి. ఏదైనా లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
వృషభ రాశివారికి పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందా? 2026 ఉగాది పంచాంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!
2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!




















