అన్వేషించండి

Parabhava Nama Samvatsara Ugadi 2026: 2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!

Ugadi 2026: తెలుగు సంవత్సరాది, చైత్ర శుద్ధ పాడ్యమి నూతన ఉగాది పండుగ 2026లో మార్చి 19 వచ్చింది. కొత్తగా రాబోయే తెలుగు నూతన సంవత్సరం పేరేంటి? విశిష్టత ఏంటి?

Parabhava Nama Samvatsara Ugadi 2026 Date : 2026 మార్చి 19 గురువారం ఉగాది
 
2025లో విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం

2026 మార్చి 19 నుంచి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం ( Parabhava Nama Samvatsara Panchangam) 

పరాభవ నామ సంవత్సరం గతంలో 1966 -1967 లో వచ్చింది..

చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ

బ్రహ్మకల్పం  ఆరంభమైన రోజు ప్రభవ సంవత్సరం...మొదటి రుతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాది జరుపుకుంటాం
 
ఉగస్య ఆదిః ఉగాదిః (Ugadi 2026)

ఉగ అంటే నక్షత్ర గమనం
నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం
 
బ్రహ్మదేవుడికి పగలు అంటే 432,00,00,000 సంవత్సరాలు..రాత్రి కూడా అంతే.. ఓవరాల్ గా సృష్టికర్తకు ఒక రోజు అంటే 864,00,00,000 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు వందేళ్లు ఆయుష్షు. ఇప్పటివరకూ ఆరుగులు బ్రహ్మలు సృష్టికార్యం పూర్తిచేశారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలు. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరం  కలియుగంలో ఉన్నాం. 

శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది.  

శ్రీ రామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు ఉగాది
 
వరాహమిహిరుడు జాతికి పంచాగాన్ని అంకితం చేసిన రోజు ఉగాది 

తెలుగు సంవత్సరాల్లో  2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవ.. ఇది 40వది 

మొత్తం తెలుగు సంవత్సరాల పేర్లు ఇవే...
 
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ

10 ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను

18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన

27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి

35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య

44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ

52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ

తెలుగు సంవత్సరాలకు ఈ పేర్లు పెట్టడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ కృష్ణుడికి 16,100 మంది భార్యల్లో సందీపని అనే రాకుమారి సంతానం అయిన 60 మంది పేర్లు ఇవి అని చెబుతారు. మరో పురాణ కథ ప్రకారం నారదుడి సంతానం పేర్లు ఇవి అని చెబుతారు. దక్షప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవే అని మరో కథనం
 
చాంద్రమాసాన్ని అనుసరించి జరుపుకునే ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలోనూ ఘనంగా జరుపుకుంటారు

గడిచిన సంవత్సరం అందించిన విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి...గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందులకు నూతన ఏడాది ముగింపునివ్వాలని కోరుకుంటూ.. ABP దేశం ప్రేక్షకులకు ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shakun Apshakun: పిల్లి ఇంట్లోకి వచ్చి పాలు తాగితే అది శుభమా - అశుభమా?
పిల్లి ఇంట్లోకి వచ్చి పాలు తాగితే అది శుభమా - అశుభమా?
Iran Srael War: మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
Lucky Birth Dates for Women: ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టం తెస్తారా? సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?
ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టం తెస్తారా? సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget