అన్వేషించండి

Cricket In Olympics: ఒలంపిక్స్‌లోక్రికెట్‌ను ఇన్నేళ్లు చేర్చకపోవడానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

Cricket In Olympics: 2028  లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను చూడబోతున్నాం. అయితే ఇన్ని రోజులు ఇంట్రెస్టింగ్ క్రికెట్‌ను ఎందుకు చేర్చలేదు. దీని వెనుక ఏం జరిగింది.

Cricket In Olympics: ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద క్రీడా సమరం ఒలంపిక్స్. ఈ క్రీడా వేదికపై ఒక్క పతకం గెలిచినా చాలని ప్రాణాలు ఫణంగా పెట్టి శ్రమిస్తారు క్రీడాకారులు. ఆయా దేశాలు ఎంతో శిక్షణ ఇచ్చి మరీ ఒలంపిక్స్ మెడల్స్ తీసుకురావాలని క్రీడాకారులను ప్రోత్సహిస్తుంటాయి. అలాంటి వేదికపై క్రికెట్ లేకపోవడం వింతైన విషయమే కదా. ఇవాళ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కింద 108 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. ఇందులో పూర్తి సభ్యత్వం కలిగిన దేశాలు 12 కాగా, 96  అసోసియేటెడ్ సభ్యత్వం దేశాలకు ఉంది. ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండిస్, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక, ఐర్లండ్ పూర్తి సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇవి టెస్ట్, వన్డే, టీ ట్వంటీ హోదా కలిగిన దేశాలు. 

ఇక 96 అసోసియేటెడ్ మెంబర్షిప్ ఉన్న దేశాల్లో ముఖ్యమైనవి నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, అమెరికా, యూఏఈ, నేపాల్,  కెనడా, ఉగాండా, పపువా న్యూగినియా వంటి దేశాలు ఉన్నాయి. వీటితోపాటు మరి కొన్ని దేశాలు క్రికెట్‌ను ఆడుతున్నాయి. ఈ దేశాలకు ఇంకా టెస్ట్ హోదా ఇవ్వలేదు. వీటిల్లో కొన్ని వన్డే హోదా కలిగినవి. ప్రపంచ కప్‌లో ఆడిన దేశాలు ఉన్నాయి. మిగతా దేశాలకు టీ ట్వంటీ హోదా ఉంది. టీ ట్వంటీ క్రికెట్ ఫార్మాట్ వచ్చాకా చాలా దేశాలు క్రికెట్‌పై మక్కువ పెంచుకుని ఐసీసీలో చేరాయి. అయితే తాజాగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్‌లో టీట్వంటీ ఫార్మట్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. అయితే ఇప్పటి వరకు క్రికెట్‌ను ఒలంపిక్స్‌లో ఎందుకు చేర్చలేదో మీకు తెలుసా? 

కిక్రెట్‌ను ఒలంపిక్స్‌లో చేర్చకపోవడానికి కారణాలు ఇవే..

1. పరిమిత ఆదరణ కలిగిన క్రికెట్- క్రికెట్ ముఖ్యంగా కామన్‌వెల్త్ దేశాల్లో అంటే ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎక్కువ ఆడే క్రీడ. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు ఆదరణ తక్కువ అని భావించి గతంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ క్రీడకు ఆఫ్రికా, యూరప్ ఖండంలో పెద్దగా ఆదరణ లేదు. అదే రీతిలో అమెరికాలోనూ అంత ఆదరణ పొందలేదు. పరిమతి ఆదరణ మాత్రమే ఉండటంతో క్రికెట్‌ను ఒలంపిక్స్‌లో చేర్చలేదు. అయితే 1900లో జరిగిన పారిస్ ఒలంపిక్స్‌లో మాత్రం రెండు జట్ల మధ్యే క్రికెట్ పోటీ నిర్వహించారు. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య అంటే రెండు దేశాల మధ్యే క్రికెట్ పోటీ నిర్వహించారు. ఆ తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ప్రాచుర్యం లేదన్న కారణంతో ఐఓసీ క్రికెట్ పక్కన పెట్టింది.

2. క్రికెట్ ఆడే టైం కూడా ముఖ్యం - పాత రోజుల్లో క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్. గతంలో క్రికెట్ మ్యాచ్‌లు ఆల్ అవుట్ అయ్యే వరకు జరిగేవి. వారం కావచ్చు, పది రోజులు కావచ్చు. టైం ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి దాన్ని ఆరు రోజులు ముందు కుదించారు. కాలక్రమేనా ఐదు రోజులకు తీసుకొచ్చారు. ఇన్ని రోజులు క్రికెట్ పోటీలు ఒలంపిక్స్‌లో నిర్వహించడం కష్టతరమైన పని. వన్డే ఫార్మాట్ వచ్చినా రోజంతా మ్యాచ్‌లు వీక్షించడం కష్టం. ఈ కారణాలతో అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం క్రికెట్‌ను పక్కన పెట్టింది. టీ ట్వంటీ ఫ్రార్మాట్ రావడం, త్వరిత గతిన మ్యాచ్ ఫలితాలు వస్తుడంటం వల్ల క్రికెట్‌ను తిరిగి ఒలంపిక్స్‌లో చేర్చింది ఐఓసీ.

3. ఐసీసీ షెడ్యూల్ - ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కింద క్రికెట్ ఆడే దేశాలకు ఏడాది పాటు టెస్ట్, వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్‌లో క్రికెట్ షెడ్యూల్ నిర్ణయిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక త్రైపాక్షిక క్రికెట్ పోటీలు జరుగుతాయి. వన్డే ప్రపంచకప్, టెస్ట్ సిరీస్‌లు, టీ ట్వంటీ వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఏడాదంతా క్రికెట్ క్యాలండర్ మొత్తం బిజీ షెడ్యూలే. దాంతో పాటు ఐపీఎల్, బిగ్‌బాష్ లాంటి లీగ్‌లు ఉండనే ఉన్నాయి. ఈ షెడ్యూల్ మధ్యలో ఒలంపిక్స్ కోసం ఇటు ఐసీసీ అటు ఐఓసీ ఈ క్రీడను ఒలంపిక్స్ లో చేర్చాలన్న ఆలోచన చేయలేదు. టీ ట్వంటీ ఫార్మట్ వల్ల కొంత వెసులుబాటు ఇచ్చి ఇప్పుడు ఒలంపిక్స్‌లో దీన్ని చేర్చారు. 

4. క్రికెట్ గ్రౌండ్ సమస్య - ఒలంపిక్స్ నిర్వహించే దేశాల్లో క్రికెట్ క్రీడా మైదానలు లేకపోవడం సమస్యే. ఉదాహరణకు జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, బ్రెజిల్ వంటి దేశాలు క్రికెట్ ఆడే దేశాలు కావు. అక్కడ ఒలంపిక్స్ నిర్వహిస్తే క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం కష్టమైన పనే. ఖర్చుతో కూడుకున్న పని.  సాధారణంగా ఒలంపిక్స్ నిర్వహించే దేశాలు క్రీడా మైదానాలు పలు క్రీడలు ఒకే దగ్గర ఆడేలా ప్లాన్ చేసి గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తుంది. కాని క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు, సీటింగ్, పిచ్ నిర్మాణం ప్రత్యేకంగా ఉండాలి. ఎంతో ఖర్చుతో తాత్కాలికంగా క్రికెట్ గ్రౌండ్ నిర్మిస్తే ఆ తర్వాత ఆ దేశాలు వాటిని నిరుపయోగంగా ఉంచాల్సిన పరిస్థితి. ఇలాంటి సవాళ్లు కూడా గతంలో క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చకపోవడానికి గల కారణాల్లో ఒకటిగాఉంది.

5. ఆర్థిక సమస్యలు-  ఐఓసీ, ఐసీసీ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్త క్రీడగా ఐఓసీ గుర్తించడం లేదు. ప్రపంచ క్రీడా మార్కెట్‌లో క్రికెట్ వాటా తక్కువని భావిస్తోంది. విభిన్న ఆకర్షణీయమైన క్రీడల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఐఓసీ ఆలోచన. మరోవైపు క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐఓసీతో పంచుకోవడం ఐసీసీకి ఇష్టం లేదన్న వాదనలు ఉన్నాయి. ఒలంపిక్స్‌లో క్రికెట్ చేర్చితే వచ్చే ఆదాయాన్ని ఈ రెండు సంస్థలు పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఐసీసీకి మింగుడుపడని విషయంగా కొద్ది మంది క్రీడా విశ్లేషకులు చెబుతారు. అయితే ఇవన్నీ అధిగమించి ఇప్పుడు 2028లో క్రికెట్‌ను కూడా ఒలంపిక్స్‌లో చూడటం నిజంగా గొప్ప విషయంగా చెప్పవచ్చు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Cricket at Olympics 2028:128 ఏళ్ల నిరీక్షణకు తెర! 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌! వేదిక ప్రకటించి జైషా!
128 ఏళ్ల నిరీక్షణకు తెర! 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌! వేదిక ప్రకటించి జైషా!
Lieutenant Colonel Neeraj Chopra: 'లెఫ్టినెంట్ కల్నల్'గా నీరజ్ చోప్రా, జావెలిన్ వీరుడికి ప్రోమోషన్
'లెఫ్టినెంట్ కల్నల్'గా నీరజ్ చోప్రా, జావెలిన్ వీరుడికి ప్రోమోషన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget