అన్వేషించండి
Paris Olympics 2024 Closing Ceremony: అంబారాన్నంటిన విశ్వ క్రీడా ముగింపు సంబరాలు
Paris Olympics 2024 Closing Ceremony: పారిస్ ఒలింపిక్స్ సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఈ వేడుక కోసం స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం ఒక థియేటర్‌గా మారిపోయింది.

మను, శ్రీజేష్ ముందు నడవగా, భారతావని పులకించగా
1/8

ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు మెరిశారు. రెండు ఒలింపిక్స్ పతకాలతో చరిత్ర సృష్టించిన మను బాకర్ త్రివర్ణ పతకాన్ని చేతబూని నడపగా... ఈ ఒలింపిక్స్‌తో తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన శ్రీజేష్ పక్కనే నడిచాడు.
2/8

మిగిలిన భారత బృందం వారిని అనుసరించింది. ఈ భావోద్వేగ క్షణాలను క్రీడా ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూసింది.
3/8

పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. ఫ్రాన్స్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుక అదిరిపోయింది.
4/8

లాస్‌ఏంజెలెస్ వేదికగా 2028 ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పారిస్ ముగింపు వేడుకల్లో ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ ఒలింపిక్ పతకాన్ని లాస్ఏంజెలెస్ మేయర్ కారెన్‌కు అందించారు.
5/8

పారిస్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది.
6/8

ఈ వేడుక కోసం స్టేడియంను థియేటర్‌గా మార్చారు. ఈ వేడుకలో కళాకారుల ప్రదర్శన మతిపోగొట్టింది.
7/8

ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ముగిశాయి. జులై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా.. ఆగష్టు 11న క్లోజ్ అయ్యాయి.
8/8

ఎన్నో సంచలనాలు, మరెన్నో అబ్బురపరిచే ప్రదర్శనలు, కొత్తగా నమోదైన రికార్డులు, త్రుటిలో చేజారిన పతకాలకు ఈ ఒలింపిక్స్ సాక్ష్యంగా నిలచింది.
Published at : 12 Aug 2024 10:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion