అన్వేషించండి
Paris Olympics 2024: కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
India vs Spain Hockey Olympics 2024: భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను చిత్తు చేస్తూ వరుసగా రెండో పతకాన్ని భారత్‌కు అందించింది.

భారత్ ఖాతాలో మరో పతకం
1/8

ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత హాకీ యోధులు అదరగొట్టారు. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం అందించారు.
2/8

స్పెయిన్‌ను చిత్తు చేస్తూ వరుసగా రెండో పతకాన్ని భారత్‌కు అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత ఆటతీరుతో అలరించిన వేళ... భారత్ పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది.
3/8

ఒకదశలో వెనకబడిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుస గోల్స్‌తో ప్రత్యర్థికి దడపుట్టించాడు. ఆఖర్లో స్పెయిన్ రెండు గోల్ ప్రయత్నాలను అడ్డుకొని టీమిండియా చిరస్మరణీయ విజయంతో కాంస్యాన్ని ముద్దాడింది.
4/8

తన కెరియర్ లో ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు ఘనమైన వీడ్కోలు ఇది.
5/8

విశ్వ క్రీడల్లో ఆద్యంతం రఫ్పాడించిన భారత హాకీ జట్టు కాంస్యం మ్యాచ్‌లోనూ చెలరేగింది. ప్రత్యర్థి గోల్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకొని పకత గర్జనతో యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది.
6/8

తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ది గ్రేట్ ఆఫ్ వాల్ ఆప్ ఇండియా శ్రీజేష్ భావోద్వేగానికి గురయ్యాడు. విశ్వ క్రీడల్లో కాంస్య పతకంతో తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
7/8

పారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్లింది. 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆసీస్‌పై విక్టరీతో చరిత్ర సృష్టించింది.
8/8

నాలుగు దశాబ్దాల ఎదురుచూపుల తరువాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకంతో మెరిసింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాన్ని సాధించి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Published at : 08 Aug 2024 07:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion