అన్వేషించండి

RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు, కేవలం బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా వింగ్ పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

BRS Fight against Telangana Govt | హైదరాబాద్: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని, హోం మంత్రి కూడా ముఖ్యమంత్రే అని బీఆర్ఎస్ నేత ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ అన్నారు. రీ ట్వీట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు, ఐటీ యాక్ట్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ లు నమోదు అవుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ద్వంసం చేస్తున్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం హరిస్తున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 

బీఆర్ఎస్ పోరాటాన్ని జీర్ణించుకోలేక కేసులు

తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆధారాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. అసెంబ్లీ లోపలా బయటా గణాంకాలతో సహా రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ ఎండగట్టింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారు. మార్చి 15 ,16 తేదీల్లో పదిహేను కేసులు పెట్టారు. ఆఖరికి రీ ట్వీట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. ఐటీ యాక్ట్ కు వ్యతిరేకంగా కేసులు నమోదు అవుతున్నాయి.  

2023 లో కేసీఆర్ హయంలో  తెలంగాణ సైబర్ సెక్క్యూరిటీ బ్యూరో ఏర్పడింది. సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజలను కాపాడాలన్న మంచి ఉద్దేశంతో ఆ బ్యూరో పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి హోం మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను దుర్వినియోగం చేస్తున్నారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరో ను కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారు.  కొందరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే ఫోకస్ చేశారు. 

కేటీఆర్ పై దారుణమైన పోస్టులపై చర్యలేవీ

గాంధీ భవన్, బీజేపీ ఆఫీసులు సైబర్ పెట్రోలింగ్ లో లేవు. రేవంత్ సైన్యం పేరిట కేటీఆర్ పై దారుణమైన పోస్టులు పెడితే చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్ని దారుణమైన పోస్టులు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? గౌతమ్ ,దిలీప్ కొణతం, క్రిశాంక్ సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. కానీ తెలంగాణ సీఎం  రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధితుడు, ఇన్వెస్టిగేటర్, జడ్జి అన్ని పాత్రలు సీఎం రేవంత్ రెడ్డి పోషిస్తున్నారు 

జైల్లో తనను ఘోరంగా చూశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. జైల్లో తనను బాగా చూసుకున్నారని ఓ ఛానల్ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్వయంగా రేవంత్ చెప్పారు. నాగయ్య అనే తోటి ఖైదీ తనకు అన్ని చేసిపెట్టారని చెప్పారు. నాగయ్యను వాడు వీడు.. కింద కూర్చునే వాడంటూ రేవంత్ ఫ్యూడల్ మైండ్ సెట్ ను చాటుకున్నారు 

రేవంత్ సోదరులు చెబితేనే..
సైబర్ పెట్రోలింగ్ జరగాల్సింది సెక్రటేరియట్ లో కానీ రేవంత్ సోదరులు చెబితే కానీ సచివాలయంలో ఫైళ్లు కదలడం లేదు. అక్కడ సైబర్ పెట్రోలింగ్ జరగాలి. ఆర్ ఆర్ టాక్స్ యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. దిలీప్ కొణతం, జర్నలిస్టు రేవతిపై వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. వారు ఏం తప్పు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రం లో నేరాలు చేస్తున్నాయి. వాటి మీద కేసులు పెట్టండి. మేం ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు.  
రేవంత్ రెడ్డికి భయపడొద్దు..
పోలీసు అధికారులు రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. మేం అధికారంలోకి వచ్చాక నిజాయతీ గల అధికారులను గుర్తించి ప్రోత్సహిస్తాం. మాకు ఏ ఫేవర్ అవసరం లేదు. హరీష్ రావు ను పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేతపై పోలీసులు కేసు పెట్టలేదు. గాంధీ భవన్ లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తే.. యధాతథంగా ఎఫ్ఐఆర్ లుగా కేసులు నమోదు చేస్తున్నారు.
కొడంగల్ కు చెందిన ఓ అధికారిని గొర్రెల స్కాంలో 52 రోజులు ఆకారణంగా జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికైనా భాద్యతగా పని చేయాలి. తప్పు చేస్తున్న పొలీసులకు వారి కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ చేయాలని’ సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget