(Source: Poll of Polls)
MS Dhoni Trolling: కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైరయిపో.. ధోనీపై భగ్గుమన్న ఫ్యాన్స్
43 ఏళ్ల ధోనీ వరుసగా 18వ ఐపీఎల్ సీజన్ ఆడుతున్నాడు. ఏడాదిలో 10 నెలలు ఎలాంటి క్రికెట్ ఆడకుండా, రెండు నెలలు మాత్రమే ఐపీఎల్ మాత్రమే ఆడుతాడు. ఈ మెగాటోర్నీలో తప్ప ధోనీ క్రికెట్ ఆట ఎక్కడా చూడలేము..

IPL 2025 CSK VS RCB Updates: 17 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా అసలు గెలిచేందుకు పోరాటం చేయకుండా, ఓటమి అంతరాన్ని తగ్గించడానికి ఆడటంపై మండిపడుతున్నారు. ఇక మాజీ కెప్టెన్, వెటరన్ ఎంఎస్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 197 పరుగుల టార్గెట్ ఛేదనలో 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయన దశలో బ్యాటింగ్ కి రాకపోవడంపై మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో 13వ ఓవర్లో శివమ్ దూబే ఔట్ కాగా, అప్పుడంతా ధోనీ బ్యాటింగ్ కి వస్తాడని అంతా ఎదురు చూశారు. అయితే అనూహ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కు వచ్చాడు. దీనిపై అందరూ విస్మయానికి గురయ్యారు. ఇక 16వ ఓవర్లో అశ్విన్ ఔటవడంతో అప్పుడు నెం.9లో తాపీగా ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు. దీనిపైనే ధోనీనీ ఏకిపారేస్తున్నారు. ధోనీ కెరీర్ లో ఇది అత్యంత లో పాయింట్ అని, ఇంతకన్నా అతను రిటైర్ అయితే మేలని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
What’s the point of #Dhoni batting at No. 9 in a 197-run chase when CSK is struggling at 100? CSK’s tactics today showed they had given up.
— Amit Kumar (@AmitMaithil7) March 28, 2025
Dhoni at No. 9—just for a couple of sixes and PR? A few sixes for the fans won't change the bigger picture. Maybe it's time to ask—has… pic.twitter.com/TLekj4Qy1B
నమ్మకం లేదా..?
మరికొంతమంది ఫ్యాన్స్ సీఎస్కే ప్రణాళికలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన మ్యాచ్ లో పవర్ ప్లేలో మూడు వికెట్లు పడిపోగానే, గెలుపు కోసం ప్రయత్నించకపోవడం, ధోనీని నెం.9లో ఆడించడం తదితర అంశాలపై ఏకి పారేస్తున్నారు. ఇక తనపై తనకు నమ్మకం లేకనే ధోనీ నెం.9లో బ్యాటింగ్ కు వస్తున్నాడా..? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది సందట్లో సడేమియా అన్నట్లు కేవలం హైప్, టికెట్లు అమ్ముకోవడం కోసమే ధోనీకి జట్టులో చోటు కల్పిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఆర్సీబీని చిత్తుగా ఓడించడాన్ని చూద్దామని ఆశగా స్టేడియంలోకి వచ్చిన సీఎస్కే ఫ్యాన్స్ కు ఆర్సీబీనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
Dhoni coming at no 9 is lowest point in his career. He should retire gracefully than this embarrassment. #IPL2025 #RCBvCSK
— kirat.13_ (@kirat8513) March 28, 2025
బెడిసి కొట్టిన వెక్కిరింపులు..
ఇక స్టేడియంలో కొంతమంది సీఎస్కే అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎరుపు రంగులో గల లాలీపాప్ లు ప్రదర్శిస్తూ, ఆర్సీబీ ప్లేయర్లను వెక్కిరించారు. ప్రతి సంవత్సరం ఈ సాలా కప్ నమ్ దే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తమ జట్టును ఉత్తేజపరుస్తూ ఉంటారు. దానికి కౌంటర్ గా మీకు కప్పు రాదు, లాలీపాపే గతి అంటూ వ్యంగంగా ఏడిపించేందుకు సీఎస్కే ఫ్యాన్స్ ఇలా చేశారు. అయితే చేపాక్ గడ్డపై 17 ఏళ్ల తర్వాత సీఎస్కేను ఓడించి ఆర్సీబీ ఘనంగా ఈ వెక్కిరింపులను తిప్పికొట్టింది. అలాగే సీజన్లో రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. శుక్రవారం టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పతిదార్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 51)తో స్టన్నింగ్ ఫిఫ్టీ చేశాడు. నూర్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటి, పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం చెన్నై ఛేదనలో చేతులెత్తేసింది. ఓవర్లన్నీ ఆడి.. 8 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41, 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోష్ హేజిల్ వుడ్ 3 వికెట్లతో సత్తా చాటాడు.




















