PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దాడులకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలపెట్టబోమని ప్రధాని మోదీ తెలిపారు. భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఘటననపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీ కారు బ్లాస్ట్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్ అయ్యి 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పేలుడుకు కారణమైన ఐ20 కారు వివరాలపై ఢిల్లీ పోలీసులతో NIA, NSG అధికారులు దృష్టి సారించారు. అయితే దర్యాప్తులో ఓ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో పేలుడుకు గురైన కారు 3 గంటలు పాటు పార్క్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6.20 వరకూ కారును పార్కింగ్ లోనే ఉంచి ఆ తర్వాత బయటకు తీసుకు వస్తున్న వ్యక్తి విజువల్స్ ను పోలీసులు గుర్తించారు. కారు నడపుతున్న వ్యక్తిని డా.మహ్మద్ ఉమర్ గా భావిస్తున్నారు. డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఉమర్ కారు నడుపుతున్న విజువల్స్ ను పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. అయితే ఫరీదాబాద్ మాడ్యూల్ తో ఈ డాక్టర్ కి కూడా సంబంధం ఉందా అన్న కొత్త కోణంలోనూ పోలీసులు, NIA దర్యాప్తు ప్రారంభించారు. అక్కడా ఇక్కడా వైద్యులే ఉండటంతో ఈ అంశాన్ని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.





















