అన్వేషించండి

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31రోజున జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1కు పోస్టుపోన్ చేశారు.

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక గమనిక. నెల 31న అంటే సోమవారం రాయాల్సిన 1న సోషల్ స్టడీస్ పరీక్ష ఒకరోజు వాయిదా పడింది.
31-03-2025 (సోమవారం)న ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా సెలవు దినంగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కాబట్టి సోషల్ స్టడీస్ పరీక్ష 01-04-2025 న అంటే(మంగళవారం)న నిర్వహిస్తామన్నారు ఏపీ పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజ్ ఐఏఎస్. పరీక్ష తేదీలోని ఈ మార్పుని ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, స్కూల్ హెడ్మాస్టర్లు, సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖ, ఇతరులతో సహా అన్ని లైన్ డిపార్ట్‌మెంట్‌ల సిబ్బందికి తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవో తదితర అధికారులకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా డైరెక్టర్ సూచించారు. ఈ నేపథ్యంలో మెటీరియల్, ప్రశ్నాపత్రాలు తీసుకెళ్లడానికి   ఈ నెల 31న నిల్వ కేంద్రాల  (స్టోరేజీ పాయింట్లు) వైపు వెళ్లొద్దన్నారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి సోషల్ స్టడీస్ పరీక్షను  సోమవారం బదులుగా మంగళవారం రాయడానికి ప్రిపేర్ కావాలని ఆయన తెలిపారు.

శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలో 98.65 శాతం హాజరు

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన జీవ శాస్త్ర (బయాలజికల్ సైన్స్) పరీక్ష ప్రశాంతంగా జరిగింది అని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు  ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 6,36,241 మంది విద్యార్థులకు గానూ 6,27,673 మంది విద్యార్థులు హాజరు కాగా, 8345 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1376 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఒక విద్యార్థి చూసి రాస్తుండగా పట్టుబడ్డాడని, ఆ విద్యార్థిని డిబార్ చేసి సంబంధించిన ఇన్విజిలేటరును సస్పెండ్ చేశామన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు.

ఆది, సోమవారాల్లో రెవెన్యూ మున్సిపల్ శాఖలు పని చేస్తాయి : ఏపీ ప్రభుత్వం 
ఉగాది, రంజాన్ సందర్భంగా సెలవు ఉంటుందని భావించిన రెవెన్యూ మున్సిపల్ శాఖలను ఆ రెండు రోజులు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం ఆఖరు కాబట్టి స్థిరాస్థి విక్రయాలు కొనుగోలుకు వీలు పడేలా ఆ రెండు రోజులు రెవెన్యూ శాఖ, ఇంటి పన్ను చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖలో కొన్ని ప్రత్యేక కౌంటర్లు మార్చి 30 31 తారీఖుల్లోనూ పని చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. దానితో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష కూడా 31న జరిపేస్తారని కొందరు ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం  మార్చి 31న పరీక్షలు ఉండదని దానికి బదులు ఏప్రిల్ ఒకటిన పరీక్ష జరుగుతుందని స్పష్టత ఇచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget