కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని, ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయని ఒక సందేశం వైరల్ అవుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఒక లింక్ కూడా అందులో ఉంది.
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Fact Check: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోందని ఒక మెసేజ్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతోంది. లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కూడా అందులో ఉంది.

- ప్రభుత్వ ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకంపై నకిలీ సందేశం వైరల్.
- ప్రధాని ఫోటో, ప్రభుత్వ లోగోలతో దరఖాస్తు చేసుకోవాలని నకిలీ లింక్.
- పీఐబీ, విద్యా మంత్రిత్వ శాఖ ఆ వాదనలను ఖండించాయి.
- నకిలీ లింక్‌లు క్లిక్ చేయవద్దని పీఐబీ ప్రజలను హెచ్చరించింది.
Fact Check: విద్యార్థులకు సంబంధించిన ఒక మెసేజ్ బాగా వైర్ అవుతోంది. సోషల్ మీడియా వాట్సాప్‌లో బాగా షేర్ అవుతోంది. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తోందని, ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయని ఆ మెసేజ్ సారాంశం. దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయాల్సిన ఒక లింక్ కూడా ఆ మెసేజ్‌లో ఇచ్చారు.
ఈ సందేశంలో ప్రధానమంత్రి ఫోటోతోపాటు విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం జి20 లోగోలను ఉపయోగించారు. చాలామంది ఇది నిజమైన ప్రభుత్వ పథకంగా భావిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ సంస్థ అయిన పిఐబి దీన్ని ఖండించింది.
ఉచిత ల్యాప్‌టాప్ గురించి వైరల్ అవుతున్న మెసేజ్ ఏంటీ?
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోందని వైరల్ అవుతున్న మెసేజ్‌లో ఉంది. అందులో ఒక లింక్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలనుకునే వారంతా లింక్‌పై క్లిక్ చేయాలని కూడా సూచిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తారని కూడా ఆ సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశం అచ్చం ప్రభుత్వం విడుదల చేసిన సందేశంగా మార్చేందుకు దానిలో ప్రధానమంత్రి ఫోటోతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, జి20 లోగోలను కూడా పొందుపరిచారు. స్క్రీన్‌పై "ప్రభుత్వం నుండి ఉచిత ల్యాప్‌టాప్ పొందండి" మరియు "ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి" అనే పదాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే, మొదటి చూపులో ఈ సందేశం ప్రభుత్వ పథకానికి సంబంధించినదిగా అనిపించవచ్చు.
పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది?
వైరల్ అవుతున్న ఈ వాదనపై విచారణ జరిపిన తర్వాత, పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఇది పూర్తిగా అబద్ధమని ప్రకటించింది. పిఐబి ప్రకారం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు భారత ప్రభుత్వం గానీ, విద్యా మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. అంటే, వైరల్ మెసేజ్‌లో చెప్పిందంతా అబద్ధం. ఈ మెసేజ్‌కు భారత ప్రభుత్వంతో గానీ, విద్యా మంత్రిత్వ శాఖతో గానీ ఎలాంటి సంబంధం లేదని కూడా పిఐబి తేల్చి చెప్పింది. ఈ మెసేజ్‌లో ఉపయోగించిన లోగో, ఫార్మాట్, లింక్ కూడా నకిలీవే.
నకిలీ లింక్‌లపై క్లిక్ చేయవద్దు
ఇలాంటి అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రజలకు సలహా ఇస్తోంది. వైరల్ మెసేజ్‌ల లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతాయి, కానీ అలాంటి లింకులు నకిలీ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లకు దారితీయవచ్చు, అక్కడ ప్రజలను వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు చోరీకి గురి అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల, అలాంటి మెసేజ్‌లను వెంటనే నమ్మే ముందు లేదా లింక్‌పై క్లిక్ చేసే ముందు, అందులోని సమాచారాన్ని సరిచూసుకోవడం ముఖ్యం.
విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026 కింద ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనను ప్రభుత్వం కూడా ఖండించింది. వైరల్ అవుతున్న ఆ సందేశంలో, లబ్ధిదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదని పేర్కొంటూ, ఈ వాదన నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకటించింది. ఇటువంటి ప్రకటనలతో మోసపోవద్దని, ఏదైనా ప్రభుత్వ పథకం లేదా వార్తను అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రమే ధృవీకరించుకోవాలని ఆ సంస్థ ప్రజలను కోరింది.
Frequently Asked Questions
విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల గురించి వైరల్ అవుతున్న సందేశం ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తుందన్న వార్త నిజమేనా?
లేదు, ఇది పూర్తిగా అబద్ధం. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, భారత ప్రభుత్వం లేదా విద్యా మంత్రిత్వ శాఖ అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు.
ఈ సందేశంపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది?
ఈ వార్త పూర్తిగా అబద్ధమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ మెసేజ్, అందులోని లోగోలు, ఫార్మాట్, లింక్ అన్నీ నకిలీవి అని తెలిపింది.
ఇలాంటి అనుమానాస్పద లింకుల పట్ల ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
నకిలీ లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి మెసేజ్‌లను నమ్మే ముందు సమాచారాన్ని సరిచూసుకోవడం ముఖ్యం.
ట్రెండింగ్ వార్తలు





















