అన్వేషించండి

DMK Comments On Pawan Statement: పవన్ పుట్టక ముందు నుంచే హిందీ వ్యతిరేకులం, నటుల అభిప్రాయాలతో పని లేదు: డీఎంకే ఎటాక్

DMK Comments On Pawan Statement:పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు డీఎంకే కౌంటర్ ఇచ్చింది. నటుల అభిప్రాయాల ఆధారంగా కాకుండా నిపుణుల సలహాతో తమిళనాడు ముందుకెళ్తుందని ఎద్దేవా చేస్తున్నారు. 

DMK Comments On Pawan Statement: తమిళనాడులో చెలరేగిన హిందీ భాషా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దీనిపై తీవ్రంగా స్పందించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర గురించి పవన్ కల్యాణ్‌ అజ్ఞానం బయటపడిందని ఆరోపించింది. పవన్ వ్యాఖ్యలను DMK నాయకుడు TKS ఎలంగోవన్ తోసిపుచ్చారు. తమిళనాడు 1938 నుంచి హిందీ భాష అమలును వ్యతిరేకిస్తోందని అ్నారు. తమిళనాడు నటుల అభిప్రాయాల ఆధారంగా కాకుండా నిపుణుల సలహా ఆధారంగా ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ DCM పవన్ కల్యాణ్‌ ప్రకటనపై DMK నాయకుడు TKS ఎలంగోవన్ ANIతో మాట్లాడుతూ, "మేము 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాము. నటుల కాదు, విద్యానిపుణుల సలహాలు, సూచనలతో తమిళనాడు ఎల్లప్పుడూ ద్వి భాషా సూత్రాన్ని అనుసరిస్తుందని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాం. పవన్ కల్యాణ్‌ పుట్టక ముందే 1968లో ఈ బిల్లు ఆమోదం పొందింది."

పవన్‌కు తమిళనాడు రాజకీయాలు తెలియవు
"మాతృభాషలో విద్యను బోధించడం ఉత్తమ మార్గం అని మేము భావిస్తున్నందున మేము హిందీని వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. బిజెపి ప్రభుత్వం నుంచి ఏదైనా పొందగలిగేలా ఆయన (పవన్ కళ్యాణ్) ఏదో ఒక విధంగా బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు" అని ఆయన అన్నారు.

 పవన్ ఏమన్నారంటే... 

మార్చి 14, 2025న పిఠాపురంలో జయకేతనం  పేరుతో జరిగిన జనసేన ప్లీనరీలో మాట్లాడిన పవన్ కల్యాణ్‌ తమిళనాడు లేవనెత్తే చాలా వివాదలపై స్పందించారు. ఇలాంటి భారత దేశానికి మంచివి కావని కూర్చొని మాట్లాడుకునే దానికి ఎందు విధ్వంసం సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో అన్ని భాషలను గౌరవించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలమని అభిప్రాయపడ్డారు. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోవాలని సూచించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయాలని సలహా ఇచ్చారు. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి కానీ వారి భాష మాకొద్దు అంటే ఎలా అని ప్రస్నించారు. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదని అన్నారు. సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని ఎలా చెబుతారని నిలదీసారు. సంస్కృతం దేవ భాషని హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారని తెలియజేశారు.  ఇస్లాం ప్రార్థనలు అరబిక్‌లో ఉంటాయని... కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఎందుకి ప్రస్నించారు. భాషల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి కూడా క్లిష్టమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి సింబర్‌ను బడ్జెట్ నుంచి తొలగిస్తే రాష్ట్రానికో పద్ధతి పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందారు.  ఇది దేశానికి మంచిది కాదని హితవు పలికారు.  

 ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని పవన్ సలహా ఇచ్చారు.  అంతేగాని దేశం ఏమైనా కేకు ముక్కలా కోసుకొని పంచుకోవడానికి అని అన్నారు. ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటీ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీలాంటి వాళ్లు విడిపోతే నాలాంటి వాళ్లు కలపడానికి కోట్ల మంది వస్తారని హెచ్చరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget