IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయవచ్చు
రైల్వే స్టేషన్‌కు వెళ్లి కౌంటర్లలో తీసుకున్న టికెట్లు రద్దు చేసుకోవడానికి తిరిగి కౌంటర్లకు వెళ్లల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్లో కూడా రద్దు చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Train Tickets Cancel Process | సామాన్యులు సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడం రైల్వే ద్వారా సామాన్యులకు ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు రైల్వే శాఖ మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సల్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఒకవేళ మీరు రైల్వే టికెట్ కౌంటర్లు టికెట్ కొన్నప్పటికీ దాన్ని ఆన్లైన్ ద్వారా సైతం క్యాన్సల్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది. ప్రయాణికులు 139 కి ఫోన్ చేసి తమ వివరాలు తెలిపి టికెట్ రద్దు చేసుకోవచ్చని అశ్విని వైష్ణవ్ చెప్పారు. లేదా ఐఆర్సిటిసి (IRCTC) అధికారిక వెబ్సైట్లో సైతం ప్రయాణికులు క్యాన్సల్ చేసుకోవచ్చు అని.. తద్వారా ప్రయాణికులకు టైం, శ్రమ తగ్గుతుందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కౌంటర్ టికెట్ రద్దు చేసుకోవాలంటే మీరు టికెట్ బుకింగ్ సమయంలో కరెక్ట్ మొబైల్ నంబర్ ఇస్తేనే ఆన్‌లైన్‌లో టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. రైలు ఆలస్యం, రద్దు సమయాల్లో టికెట్ క్యాన్సల్ వర్తించదు. నార్మల్ సిచ్యువేషన్లో మాత్రమే కౌంటర్ టిక్కెట్ల క్యాన్సలేషన్, వాపసును రైల్వే శాఖ అనుమతిస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
టికెట్ రద్దు చేసుకునే ప్రాసెస్ ఇదీ..
- ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మోర్ (More) అనే ఆప్షన్ మీద సెలక్ట్ చేసుకోవాలి. కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ మీద క్లిక్ చేయాలి.
- అక్కడ కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ కు రీ డైరెక్ట్ అయి పేజీ ఓపెన్ అవుతుంది.
- అనంతరం మీ పీఎన్ఆర్ నంబర్, ట్రైన్ నంబర్ సహా క్యాప్చాను ఎంటర్ చేయాలి.
- కండీషన్లు చెక్ చేసుకునే చెక్‌బాక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ క్లిక్ చేయాలి.
- టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- ఆ ఓటీపీని వెరిఫై చేశాక మీ పీఎన్‌ఆర్ వివరాలు స్క్రీన్‌పై వస్తాయి. టికెట్ రద్దు చేయండి పై క్లిక్ చేయాలి
- మీ టికెట్ క్యాన్సల్ అయి, రావాల్సిన నగదు ఎంతన్నది స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- పీఎన్‌ఆర్ క్యాన్సల్ వివరాలతో మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది. రైల్వే స్టేషన్ కౌంటర్లలో అది చూపించి నగదు తిరిగి పొందాలి.
ఈటికెట్లకు బదులుగా కౌంటర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు రైలు బయలుదేరే ముందే స్టేషన్‌కు వెళ్లి టికెట్ రద్దు చేసుకోవాలా అని బీజేపీ ఎంపి మేధా విశ్రామ్ కులకర్ణి పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రయాణీకుల (టిక్కెట్ల రద్దు, ఛార్జీల వాపసు) నియమాలు 2015లో సూచించిన టైమ్ లిమిట్ ప్రకారం, వెయిట్‌లిస్ట్ లో ఉన్న PRS కౌంటర్ టికెట్ రద్దు చేసుకోవచ్చు అని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

