అన్వేషించండి

Vijayasai Reddy: కోటరీ వదలదు, కోట కూడా మిగలదు - జగన్‌పై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు

Jagan coterie: జగన్ ను విజయసాయిరెడ్డి వదిలి పెట్టడం లేదు. ఆయన కోటరీపై మరోసారి సెటైర్లు వేశారు.

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి బయటకు వచ్చేసిన విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు దూరం అంటున్నారుకానీ ఆయన తరచూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన జగన్ కోటరీపై విమర్శలు చేశారు. జగన్ పేరు పెట్టకుండా.. గతంలో తాను చేసిన కోటరీ విమర్శలకు కొనసాగింపుగా సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. 

రాజుల కథ చెప్పిన విజయసాయిరెడ్డి       

పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని.. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదన్నారు.   దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదన్నారు.  కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని..  కోటరీ మీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడన్నారు.  కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదని చెప్పాడు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదేనన్నారు.        

ఇటీవలే కోటరీపై విమర్శలు

ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి తాను వైసీపీకి జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే దూరమయ్యానని ప్రకటించారు.  మూడున్నరేళ్లలో అవమానాలు ఎదుర్కొని తాను దిగిన ప్రతి మెట్టులోను చాలామంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని చెప్పుకొచ్చారు. చుట్టూ ఉండే కోటరీ నుంచి బయటపడినప్పుడే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని, ఇంతకన్నా తాను చెప్పగలిగిందేమీ లేదన్నారు. బయటినుంచి వెళ్లే సమాచారం తనకు అనుకూలంగా ఉంటున్నప్పుడు, ఆర్థికంగా, రాజకీయంగా తనకు లాభం ఉందనుకున్న వారిని మాత్రమే జగన్‌ వద్దకు కోటరీ పంపుతుంది.   నాయకుడు చెప్పుడు మాటలను నమ్మకూడదు. దానివల్ల నాయకుడితోపాటు పార్టీ, ప్రజలు కూడా నష్టపోతారు. వైసీపీలో ప్రస్తుతం అదే జరుగుతోంది.’’ అని విజయసాయి అప్పుడు చెప్పారు.  

ముందు ముందు మరింతగా టార్గెట్ చేస్తారా ?                 

జగన్‌ మనస్సులో తనకు స్థానం లేదని తెలిసినప్పుడు మనస్సు విరిగిపోయిందని, ఇక వైసీపీలో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్‌కు చెప్పి వచ్చేశానన్నారు. చుట్టూ ఉన్న వారి మాటలు వినవద్దని, ప్రజలకు భవిష్యత్తులో ఎంతో సేవ చేయాలని లండన్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లో జగన్‌కు చెప్పానన్నారు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఘర్‌వాపసీ తనకు వర్తించదని, ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలిపారు. అయితే ఇప్పుడు మరోసారి కోటరీ గురించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ముందు ముందు ఆయన వైసీపీని  మరింతగా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.                            

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
Pawan Kalyan Latest News: అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
అవగాహన లేకే నాపై దుష్ప్రచారం- ప్రకాశ్‌రాజ్‌పై పవన్ పంచ్‌లు !
Telangana Latest News: కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Prakashraj vs Pawan:  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” - మరోసారి పవన్ ను గిల్లిన ప్రకాష్ రాజ్
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Guntur Latest News : గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
గుంటూరు నగర మేయర్ రాజీనామా- కారణం ఏంటంటే?
Ind Vs Eng Test Series: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భార‌త్ కెప్టెన్ ఖ‌రారు.. అత‌ని వైపు మొగ్గుతున్న బీసీసీఐ
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భార‌త్ కెప్టెన్ ఖ‌రారు..! అత‌ని వైపు మొగ్గుతున్న బీసీసీఐ!!
Embed widget