అన్వేషించండి

Students Missing case: బ‌డికి వెళ్ల‌మంటున్నార‌ని ఇళ్లు వ‌దిలిపోయిన ఆరుగురు విద్యార్థులు, కోన‌సీమ జిల్లాలో ఘటన

కోన‌సీమ జిల్లా ఆల‌మూరు ఖండ్రిగ పేట‌లో ఆరుగురువిద్యార్థులు అదృశ్యం అవ్వ‌డం స్థానికంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. పోలీసులు ద‌ర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల్లో రాజోలు వైపుగా వెళ్లిన‌ట్లు గుర్తించారు..

BR Ambedkar Konsaseema District | త‌ల్లితండ్రులు పిల్ల‌ల్ని చిన్న‌మాట అంటే కూడా ప‌డ‌ని విధంగా ప్ర‌స్తుత కాలంలో మ‌నం ఉన్నామ‌నిపిస్తుంది.. వారి జీవితాలు బాగుప‌డ‌తాయ‌నే త‌ల్లితండ్రులు మంచి చెడులు చెపుతారు.. లేదా చేయి చేసుకుంటారు.. అంత మాత్రాన వారికి పిల్ల‌ల‌పై ప్రేమ లేద‌నా... అయితే ఇప్ప‌డు ఇలానే తెలిసీ తెలియ‌ని వ‌య‌స్సులో పెద్ద‌పెద్ద నిర్ణ‌యాలు తీసుకుని త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు.. బడికి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో ఆరుగురు విద్యార్థ‌లు ఇళ్లు వ‌దిలి పారిపోయారు.. ఈసంఘ‌ట‌న అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు ఖండ్రికపేటలో చోటుచేసుకుంది. అయితే అయిదుగురు విద్యార్థుల అదృశ్యం వెనుక కార‌ణ‌మిదే అని స్థానికంగా అనుకుంటున్నా ఐదు రోజులైనా వారి ఆచూకీ ఎక్కడా దొరకక పోవ‌డంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయి..  ఆరుగురు పిల్ల‌ల తల్లిదండ్రులు  స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

అదృశ్యమైన వారిలో ఇద్దరు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. వీరంతా 6, 7, 8 తరగతులు చదువుతున్నారు. అలాగే వీరంతా ఒకే సమాజిక వర్గంకు చెందిన సమీప బంధువులు కూడా. అందువల్ల ఏదో బంధువులు ఇంటికి వెళ్లి ఉంటారని వీరు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ దొరకక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. 

అదృశ్య‌మైన పిల్ల‌లంతా ఒకే ప్రాంతానికి చెందిన వారే.. 
                 
రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 24 రాత్రి 7 గంటల సమయంలో వీరు ఆరుగురు ఇంటి నుంచి వెళ్లారు. అదృశ్యమైన వారిలో ఎనిమిదవ తరగతి చదువుచున్న కొమరగిరి కరుణ(14),గంధం  సత్యనారాయణ(13),ఏడవ తరగతి చదువుచున్న మర్రి సంతోష్(14),కొమరగిరి మాధురి(12),ఆరవ తరగతి చదువుచున్న కొమరిగి పుద్వీ వర్మ(12),కొమరగిరి పండు(12)లు ఉన్నారు.వీరిలో కరుణ, పృథ్వి వర్మ అక్క తమ్ముళ్లు. అలాగే కరుణ ఆలమూరు బొబ్బా జయశ్రీ జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతుంది.మిగిలిన నలుగురు బాలురులు కొత్తూరు సెంటర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువున్నారు.మాధురి మాత్రం రామచంద్రాపురంలో చదువుతుంది.ఆ అమ్మాయి ఉండేది రామచంద్రాపురమే.అయితే కరుణ,పృధ్వీ వర్మ లకు మాధురి పెద్దమ్మ కుమార్తె. వీళ్ల ఇంటికి ఆలమూరు వచ్చిన ఈ అమ్మాయి మిగిలిన అయిదుగురుతో కలిసి వెళ్లిపోయింది.

నేటికీ ల‌భించ‌ని పిల్ల‌ల ఆచూకీ.. 

 ఆల‌మూరు గ్రామంలో ఒకేసారి ఆరుగురు విద్యార్థులు అదృశ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అప్పటివర‌కు త‌మ క‌ళ్ల‌ముందు క‌నిపించిన పిల్ల‌లంతా ఒక్క‌సారిగా అదృశ్యం అవ్వ‌డంతో త‌ల్లితండ్రులు తీవ్ర ఆందోళ‌న చేందారు..  దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి ఆచూకీ కోసం అన్ని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. అలాగే మీడియా, సోషల్ మీడియాకు సమాచారం తెలిపారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేలు పారితోషికం కూడా పోలీసు అధికారులు ప్రకటించారు. వీరి సమాచారం తెలిసినవారు ఆలమూరు పోలీస్ స్టేషన్ 9440904849 లేదా రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం 9440796527, కొత్తపేట డిఎస్పి 8712692109 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు ముమ్మ‌రం..

ఆరుగురు చిన్నారులు అదృశ్యం అయిన నేప‌థ్యంలో పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.. అయితే వారి ప్రాధ‌మిక విచార‌ణ‌లో పి.గ‌న్న‌వ‌రం మండ‌లం మీదుగా రాజోలు వైపుగా వెళ్లిన‌ట్లు ప్రాధ‌మిక అంచ‌నాకు వ‌చ్చి గాలిస్తున్నారు.. అక్క‌డ ఉన్న బంధువులుకు స‌మాచారం అందించారు. అయితే ఇంకా చిన్నారుల ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డంతో త‌ల్లితండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు.. 

టాప్ హెడ్ లైన్స్

AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
Embed widget