Kulgam Encounter: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ప్రతీకారం.. కుల్గాం ఎన్కౌంటర్లో లష్కర్ అగ్ర కమాండర్ లతీఫ్ భట్ హతం!
Kulgam Encounter: జమ్మూ కశ్మీర్ కుల్గాంలో భద్రతా దళాల ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల సీఆర్పీఎఫ్ పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ ఎన్ కౌంటర్ జరిగిందని సైనిక అధికారులు చెబుతున్నారు.

Kulgam Encounter: ఇటీవల జమ్మూ కశ్మీర్ కుల్గాంలో ఇటీవల భద్రతా దళాలపై ముష్కరులు దాడికి యత్నించారు. సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడికి యత్నించిన ముష్కరులను పట్టుకునేందుకు సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో లష్కర్-ఎ-తైబా సంస్థకు చెందిన టాప్ కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
ఆపరేషన్ ఇలా
కుల్గాంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే పక్కా సమాచారంతో భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను చేపట్టాయి. బలగాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు ఎదురుదాడి చేయడంతో ఎల్ఈటీ టాప్ కమాండర్ లతీఫ్ భట్, మరో ఉగ్రవాది మరణించారు. లతీఫ్ భట్ భారత్ కు వ్యతిరేకంగా పలు ఉగ్రదాడులలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి
నవంబర్ 11న కుల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. దాడి చేసిన వారి గురించి కీలక ఆధారాలు లభించడంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
Also Read: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్
ఇటీవలి దాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ సందీప్ ఖిర్వార్ సోమవారం మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతం అంతటా అప్రమత్తతను పెంచామని తెలిపారు. అలాగే, భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కశ్మీర్లో పర్యటించారు. కుల్గాం దాడి జరిగిన 24 గంటల్లోపే, కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు బాబీ చంద్, యశ్పాల్ కుమార్ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా సైన్యంలో చేరడానికి వెళ్తుండగా వారిపై దాడి జరిగినట్లు సమాచారం.
Also Read: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
ట్రెండింగ్ వార్తలు





















