అన్వేషించండి

Horoscope Today : నూతన ఆదాయ వనరులు, ఉద్యోగ అవకాశం, కోర్టు కేసుల్లో విజయం - ఈ రాశులవారిదే అదృష్టం అంటే!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 29 శనివారం రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారు నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచిస్తున్నవారు జాగ్రత్తగా అడుగువేయాలి. అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు పనిచేసే ప్రదేశంలో మీ సూచనలకు స్వాగతం పలుకుతారు.  

వృషభ రాశి
 
ఈ రాశివారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మీరున్న రంగంలో పనిని సులువుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీరు బాధపడేలా ప్రవర్తిస్తారు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనేవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. 

మిథున రాశి

ఈ రాశివారి ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతున్నట్టైతే మీ జీవిత భాగస్వామి సలహా మీకు ప్రభావవంతంగా ఉంటుంది.  రాజకీయాల్లో చేసిన ప్రయత్నాలు మీకు మంచివి. మీ ఇంటి పునరుద్ధరణ కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కర్కాటక రాశి

ఎప్పటి నుంచో నిలిచిపోయిన రచనలను పూర్తి చస్తారు. ఉన్నత ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వరిస్తుంది.  వ్యాపారంలో   కొన్ని కొత్త   ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి పాత స్నేహితుడిని కలుస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. 

సింహ రాశి

ఈ రోజు మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కుటుంబం నుంచి నిరాశపరిచే సమాచారాన్ని వినాల్సి రావొచ్చు. మీ శత్రువులు బలంగా ఉంటారు. కష్టపడి పనులు పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలను విస్మరించవద్దు

కన్యా రాశి

ఈ రాశివారి ప్రయాణం ఈ రోజు ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. విద్యార్థులు అదనపు శ్రద్ధ వహిస్తేనే పరీక్షలు బాగా రాయగలరు. వ్యాపారంలో పాతలావాదేవీలు సమస్యలు క్రియేట్ చేస్తాయి.  ప్రేమలో ఉండేవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

తులా రాశి

పెండింగ్ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెడతారు.  పాత లావాదేవీ మీకు సమస్యగా మారుతుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్త  వింటారు.

వృశ్చిక రాశి

ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు కలిసొస్తాయి. ఇంట్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రశాంతంగా ఉంటారు. మీరున్న పనిలో అవార్డులు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. మీ నిర్ణయం మీరే తీసుకోండి

ధనస్సు రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. నూతన అధ్యయనాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా స్కాలర్ షిప్ సంబంధిత శుభవార్త వింటారు. అధికారులు మీ పనితీరు మెరుగుపర్చుకునే సలహాలు ఇస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 

మకర రాశి

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీరు చేపట్టే పనిలో స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.  ప్రతికూల పరిస్థితిలో సహనాన్ని కొనసాగించాలి. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.  విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితం పొందుతారు. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

కుంభ రాశి

ఈ రోజు మీరు చేపట్టే పనులకు అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేయాలనే ఆలోచన మేల్కొంటుంది. చాలాకాలం తర్వాత పాత స్నేహితుడిని కలిసే అవకాశం లబిస్తుంది. కొత్త ప్రత్యర్థులు ఏర్పడతారు. 

మీన రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో రావు అనుకున్న డబ్బులు చేతికందుతాయి. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లానే చేసుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు వద్దు 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget