అన్వేషించండి

Ugadi Business Astrology 2025 : ఉగాది తర్వాత రియల్ ఎస్టేట్ జోరు మామూలుగా ఉండదు - ఈ రాశుల వ్యాపారులకు లాభాలే లాభాలు!

Ugadi Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశుల వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు? ఏ ఏ రంగాలు వృద్ధి చెందుతాయో ఇక్కడ తెలుసుకోండి

 Ugadi Rasi Phalalu 2025 Business Astrology : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహ సంచారం ఏ రాశిలో ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం అద్భుతంగా ఉంది. కొన్ని రాశులకు చెందిన భాగస్వామ్య వ్యాపారుల మధ్య వివాద సూచనలున్నాయి...

మేష రాశి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి వ్యాపారులు లాభపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి  కలిసొస్తుంది. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు అధిక లాభాలు పొందుతారు.  నిర్మాణ రంగం, కాంట్రాక్టు పనులు చేసేవారికీ లాభమే.  షేర్ మార్కెట్, బంగారం , వెండి వ్యాపారులకు స్వల్ప నష్టాలుంటాయి. 

వృషభ రాశి

వృషభ రాశివారికి ఈ ఏడాది అన్ని రంగాల్లోనూ అభివృద్ధే కనిపిస్తోంది. అడుగుపెడితే సక్సెస్ అవడ పక్కా. కొత్తగా వ్యాపారం చేసేవారికీ కలిసొస్తుంది. గృహనిర్మాణ రంగంలో ఉండేవారు విశేషంగా వృద్ధి చెందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు. షేర్ మార్కెట్లో ఉండేవారు లాభపడతారు.

మిథున రాశి

మిథున రాశి వ్యాపారులకు ఈ ఏడాది విశేష యోగకాలం. ఏ వ్యాపారంలో అయినా లాభాలే లాభాలు. ముఖ్యంగా నిర్మాణ రంగం, కాంట్రాక్టు వ్యాపారులకు అధిక లాభాలుంటాయి. బంగారం, వెండి వ్యాపారులకు కలిసొస్తుంది.

కర్కాటక రాశి
 
కర్కాటక రాశి వ్యాపారులకు  తెలుగు సంవత్సరాది అనుకూలంగా ఉంటుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించేవారికి ఫలవంతంగా ఉంటుంది. భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉండేవారికి కలిసొస్తుంది. 

సింహ రాశి
 
సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. గురు, శని ప్రభావంతో కొన్ని వ్యాపారాల్లో నష్టాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి వివాదాలు తప్పవు. చిన్న వ్యాపారులకు పర్వాలేదు కానీ పెద్ద వ్యాపారులు నష్టపోతారు. నిర్మాణరంగం, వడ్డీ వ్యాపారం చేసేవారికి లాభం ఉంటుంది 

కన్యా రాశి

శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఈ రాశి వ్యాపారులకు అత్యంత అనుకూలం.  పెట్టిన పెట్టుబడులకు మీరు అనుకున్న లాభం పొందుతారు.  భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య అభిప్రాయ బేధాలు వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది. పరిశ్రమలు, నిర్మాణ రంగంలో ఉండేవారికి లాభం

తులా రాశి

తులా రాశికి చెందిన ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ , కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారు అధిక ఫలాలు పొందుతారు. 

వృశ్చిక రాశి

 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి వ్యాపారులకు అద్భుతంగా కలిసొస్తుంది. నూతన వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటే అడుగు ముందుకు పడుతుంది. అన్ని రంగాల్లో ఉండే వ్యాపారులు లాభపడతారు. నిర్మాణ రంగం, కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారికి లాభాలుంటాయి. 

ధనస్సు రాశి

ధనస్సు రాశి వ్యాపారులకు  శ్రీ విశ్వావసు నామ సంవత్సరం  లాభదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి వసూళ్లు పెరుగుతాయి.  నిర్మాణ రంగంలో ఉండేవారికి విశేష లాభం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు సాధారణ ఫలితాలనిస్తాయి.

మకర రాశి

మకర రాశి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి ఇదే మంచి సమయం. నిత్యం అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్, మిల్లులు, నిర్మాణ రంగంలో ఉండే వ్యాపారులు లాభపడతారు

కుంభ రాశి

ఈ ఏడాది కుంభ రాశి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ప్రణాళిక ప్రకారం పనులు చేస్తారు. నూతన పెట్టుబడులు పెడతారు వాటివల్ల లాభపడతారు. ఈ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూల సమయం. జాయింట్ వ్యాపారాలు చేసేవారి మధ్య మంచి అవగాహన ఉంటుంది 
 
మీన రాశి

మీన రాశికి చెందిన హోల్ సేల్ అండ్ రీటైల్ వ్యాపారులకు మంచి లాభాలుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలసిరావు. నిర్మాణ రంగంలో ఉండేవారికి మంచి ఫలితాలున్నాయి

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Waqf (Amendment) Bill 2025 Passed in the Lok Sabha | పంతం నెగ్గించుకున్న NDA | ABP DesamRCB vs GT Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 8వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamSunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్- అనుకూలంగా 226మంది ఓటు
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
IPL 2025 GT VS RCB Result Update: బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.