Money Astrology 2025 - 2026: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం - అప్రయత్న ధనయోగం!
Ugadi Panchangam 2025: ఈ ఉగాది నుంచి ఏ ఏ రాశులవారి ఆదాయం మెరుగుపడుతుంది...ఏ ఏ రాశులవారి ఆదాయానికి గండి పడుతుంది. ఎవరికి ధనలాభం ఉంటుంది? మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి...

Ugadi Rasi Phalalu 2025 Money Astrology : ఎవరికి ధనయోగం, ఎవరికి ఆర్థిక కష్టం.. మీ రాశి ఫలితం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉంది?
మేష రాశి
మేష రాశివారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆరంభం నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ప్రత్యేకంగా, ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నూతన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో ఊహించని లాభం ఉంటుంది.
వృషభ రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆరంభం కన్నా ఏడాది గడిచే కొద్దీ మీకు ప్రతిరోజూ పండుగే అన్నట్టుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అన్నీ సక్సెస్ అవుతాయి. ఈ ఏడాది నూతన పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు చేస్తారు. ప్రతి వ్యవహారంలోనూ లాభాలు ఆర్జిస్తారు.
మిథున రాశి
మిథున రాశివారు ఈ ఏడాది శక్తికి మించిన పనులు చేస్తారు. అన్నింటా లాభం పొందుతారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు అధికంగా లాభపడతారు. ఈ సమయంలో పెట్టే నూతనపెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ఫలాలు కూడా అందే సమయం ఇది.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆరంభం చికాకుగా ఉంటుంది కానీ జూలై నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రగతి మొదలవుతుంది. ఇబ్బందుల నుంచి ఒక్కో అడుగు బయటపడతారు. నూతన పెట్టుబడులు కూడా మంచి లాభాలు అందిస్తాయి
సింహ రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆరంభం సింహ రాశివారికి అదిరింది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ ఇదంతా జూలై నుంచి పరిస్థితి తారుమారవుతుంది. అడుగు ముందుకు పడాల్సిన ప్రతిచోటా వెనక్కే కానీ ముందుకు సాగలేరు
కన్యా రాశి
కొత్త తెలుగు సంవత్సరంలో కన్యారాశివారికి ఆదాయం భారీగా పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులన్నీ తిరిగి అందుతాయి. ఆర్థికపరంగా ఒక్కో అడుగు ముందుకుపడుతుంది. ఒక్కో సమస్య నుంచి బయటపడతారు.
తులా రాశి
ఉగాది నుంచి మొదటి రెండు మూడు నెలలు తులా రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఎందులో పెట్టుబడి పెట్టినా పెద్దగా కలసి రాదు. ఆర్థికంగా అడుగు ముందుకుపడదు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. స్తిరాస్తులు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చికరాశివారికి అప్రయత్న ధనలాభం ఉంటుంది. నూతన ఆస్తులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి ఏడాది ఆరంభం బావుంటుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక వివాదాల్లో ఉండేవారు వాటి నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచిస్తారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం అంతగా కలసిరాదు
మకర రాశి
ఈ ఏడాది మకర రాశివారి ధనం అమాంతం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికపరంగా ఊహించనంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కొంత కష్టకాలమే అయినప్పటికీ దైవబలంతో నెగ్గుకొస్తారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇతర ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు.
మీన రాశి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశివారికి ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మీ మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

