Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
Visakhapatnam Trains | ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు జత చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు వెల్లడించారు.

పిల్లలకు పరీక్షలు పూర్తవుతున్నాయి. వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. దానితో ప్రయాణాలకు రెడీ అవుతున్న ప్రజల సౌకర్యార్థం విశాఖ మీదగా నడిచే కొన్ని రైళ్లకు ఏప్రిల్ నెలలో అదనపు భోగిలను ఏర్పాటు చేస్తున్నారు వాల్తేరు డివిజన్ అధికారులు. ఆ రైళ్లు ఇవే.
1. ట్రైన్ నెంబర్ 58506 తో విశాఖపట్నం గుణుపూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తారీకు వరకు ఒక స్లీపర్ కోచ్ ను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు -
2. ట్రైన్ నెంబర్ 58505 తో గుణుపూర్ - విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు కూడా ఏప్రిల్ నెల అంతా ఒక అదనపు బోగి ఏర్పాటు చేస్తున్నారు.
3. ట్రైన్ నెంబర్ 58501 తో విశాఖపట్నం – కిరండోల్ మధ్య నడిచే రైలుకు కూడా అదనంగా ఒక స్లీపర్ కోచ్ ను ఏప్రిల్ 12.04.2025 నుండి 30.04.2025 వరకూ ఏర్పాటు చేస్తున్నారు.
4. ట్రైన్ నెంబర్ . 58502 తో కిరండోల్ - విశాఖపట్నం మధ్య నడిచే రైలుకు ఒక స్లీపర్ కోచ్ ను 13.04.2025 నుండి 01.05.2025 వరకూ ఏర్పాటు చేస్తున్నారు.
5. ట్రైన్ నెంబర్ 20809 తో సంభాల్పూర్ – నాందేడ్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ కు ఒక థర్డ్ ఏసీ కోచ్ అలాగే ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను 04.04.2025 నుండి 28.04.2025.వరకూ ఏర్పాటు చేసారు.
6. ట్రైన్ నెంబర్ తో 20810 తో నాందేడ్ – సంభాల్పూర్ మధ్య నడిచే ట్రైన్ కి ఒక థర్డ్ ఏసీ కోచ్ తో పాటు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను 05.04.2025 నుండి 29.04.2025 వరకూ అదనంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రయాణికులు ఈ మార్పులను గమనించుకొని రిజర్వేషన్ చేసుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్
కమర్షియల్ మేనేజర్ K.సందీప్ సూచించారు.





















