Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Vishnuvardhan Reddy : మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం, ఆరెస్సెస్ లో మహిళలు లేరంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య వాదన వైరల్ అవుతోంది.

War between Prakash Raj and BJP leader Vishnuvardhan Reddy : జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో బీజేపీని వ్యతిరేకించే నటుడు ప్రకాష్ రాజ్ కు, బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అయిన విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. విశాఖపట్నంలో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. మావోయిస్టుల్ని ఎందుకు కాల్చి చంపుతున్నారని.. వారిని జన జీవన స్రవంతిలోకి వచ్చేలా చూడాలన్నారు. అదే సమయంలో ఆరెస్సెస్ లో మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరని ప్రశ్నించారు.
ఈ విమర్శలపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. అయితే ఆయన స్పందనపైనా ప్రకాష్ రాజ్.. వెంటనే రియక్ట్ అయ్యారు కాలిందా అంటూ స్పందించారు.
వెంటనె react అయ్యారు కాలిందా ??? 😜😜😜😜 #justasking https://t.co/TeDctiLuEK
— Prakash Raj (@prakashraaj) December 27, 2025
దీనికి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. కాలిన వాసన ఎక్కడ వస్తుందో మీ మాటల ద్వారానే తెలిసిపోతోందని నిజం చెప్పులేసుకునేలోపు అబద్దం ప్రపంచం అంతా చుట్టి వస్తుందన్నట్లుగా ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్ ఇవ్వకపోతే మీలాంటి వాళ్లు చేసే తప్పుడు ప్రచారాలు వేగంగా ప్రజల్లోకి వెళ్తాయన్నారు.
మావోయిస్టులు ఎంతో మంది అమాయకుల్ని చంపారు. అందులో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. పోలీసులు ఉన్నారు. రాజకీయ నేతలు ఉన్నారు. ఏ కారణంతో చంపినా… అసలు అలా చంపే హక్కు ఉందని ఎప్పుడైనా ప్రశ్నించారా .. అడవిలో తమ పట్టు సడలిపోతుందని అడవి బిడ్డల్ని ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇష్టారీతిన చంపినప్పుడు మాట్లాడారా.. అని ప్రశ్నించారు. మావోయిస్టులు లొంగిపోవడానికి అన్ని అవకాశాలు కల్పించారని.. లొంగిపోయిన వాళ్లు వేల మంది ఉన్నారని.. విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పండిపోయిన నేతలు కూడా ఆరెస్సెస్ ఎంత గొప్పదో చెబుతున్నారని ఇప్పుడు ఆరెస్సెస్ గురించి ఎందుకు వ్యతిరేకతంగా మాట్లాడతారని ప్రశ్నించారు.
కాలిన వాసన ఎక్కడ వస్తుందో మీ మాటల ద్వారానే తెలిసిపోతోంది అర్బన్ నక్సల్ రాజ్ గారూ.మీ దగ్గర వీటికి సమాధానం ఉందా?@prakashraaj #justasking
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 28, 2025
నిజం నిద్రలేచేలోపు అబద్దం ప్రపంచం అంతా చుట్టి వస్తుందన్నట్లుగా ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్ సమాధానం ఇవ్వకపోతే… https://t.co/qUCAxDn29f
అన్నీ తెలిసినా ఎర్రపార్టీల నీడకు వెళ్లి చల్లగా నాలుగు అబద్దాలు చెప్పారని మేం స్పందించేసరికి నీకు కాలిందా అని రివర్స్ లో ప్రశ్నించారు. గతంలోనూ వీరి మధ్య వాదోపవాదాలు జరిగాయి.





















