Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Indians in US: భారతీయులపై అమెరికాలో కొంత మంది విద్వేష ప్రచారం చేస్తున్నారు. కానీ అమెరికాలో భారతీయులు ఆ దేశ వృద్ధికి సహకరిస్తున్నారు కానీ.. ప్రభుత్వ సాయం పొందడం లేదని ట్రంప్ ప్రకటించారు.

India Not in Trump List: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక చార్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు కారణం అవుతోంది. వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చిన వలసదారులు అక్కడ ఎంత వరకు ప్రభుత్వ ఆర్థిక సాయం (Welfare Benefits) పొందుతున్నారనే అంశంపై ఈ డేటాను ఆయన విడుదల చేశారు. ఇందులో భారతదేశానికి సంబంధించిన వివరాలు లేకపోవడంపై చర్చ జరుగుతోది.
అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర - ట్రంప్ డేటాలో వెల్లడైన అసలు నిజం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వలసదారుల సంక్షేమ పథకాల వినియోగంపై ఒక అధికారిక నివేదికను విడుదల చేశారు. సుమారు 120 దేశాల నుంచి వచ్చిన వలసదారుల కుటుంబాలు అమెరికా ప్రభుత్వ సాయంపై ఎంత మేర ఆధారపడుతున్నాయో ఈ చార్ట్ వివరిస్తోంది. ఆశ్చర్యకరంగా, ఈ సుదీర్ఘ జాబితాలో భారతదేశం ఎక్కడా కనిపించలేదు. అంటే, అమెరికాలో ఉంటున్న భారతీయ వలసదారులు ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా, తమ స్వశక్తితో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఈ గణాంకాలు పరోక్షంగా స్పష్టం చేస్తున్నాయి.
డేటా ఏం చెబుతోంది?
ట్రంప్ పోస్ట్ చేసిన గణాంకాల ప్రకారం.. భూటాన్ (81.4%), యెమెన్ (75.2%), సోమాలియా (71.9%) వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులు అత్యధికంగా ప్రభుత్వ సాయం పొందుతున్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (54.8%), పాకిస్థాన్ (40.2%) కూడా ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి. అయితే, అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన వలస సమూహాలలో ఒకటైన భారతీయుల పేరు ఈ జాబితాలో లేకపోవడం వారి ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ గణాంకాల ప్రకారం, భారతీయ అమెరికన్ల సగటు వార్షిక గృహ ఆదాయం 1,51,200 డాలర్లు అంటే సుమారు రూ. 1.25 కోట్లుగా ఉంది. ఇది అమెరికా సగటు కంటే చాలా ఎక్కువ.
🇺🇸 🇮🇳 Trump released data on which immigrant households receive assistance. One country stands out by its absence: India.
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 5, 2026
Still, Indian immigrants are relentlessly targeted online. This isn’t about evidence—it’s outrage farming, fueled by bots and bad-faith campaigns.
Nearly 5… pic.twitter.com/qEj7kUpMzx
వాస్తవాలు ఇలా ఉంటే, సోషల్ మీడియాలో మాత్రం భారతీయుల పట్ల వ్యతిరేకత పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఎక్స్ (X) వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో భారతీయులను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత ప్రచారాలు జరుగుతున్నాయి. భారతీయులు అమెరికా వనరులను దోచుకుంటున్నారనే అపోహను సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, కానీ ట్రంప్ విడుదల చేసిన డేటా ఈ వాదనలన్నింటినీ పటాపంచలు చేసిందని నిపుణులు వివరిస్తున్నారు.
అమెరికాలో ఉన్న దాదాపు 50 లక్షల మంది భారతీయులు కేవలం నివసించడం మాత్రమే కాకుండా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. ఐటీ, వైద్యం, వ్యాపార రంగాల్లో అగ్రగామిగా ఉంటూ, బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులు చెల్లిస్తూ అమెరికా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయులు కష్టపడే తత్వానికి, క్రమశిక్షణకు నిదర్శనం.. ట్రంప్ డేటా ఇదే విషయాన్ని నిర్ధారించింది అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు ఎన్ని జరిగినా, వాస్తవ గణాంకాల ముందు అవి నిలబడలేవని ఈ ఉదంతం నిరూపించింది.





















