అన్వేషించండి

Vijay Latest News: ఎవరితో పొత్తు లేదు, నేను ప్రజల టీమ్! రాజకీయ సమీకరణాలపై విజయ్ సంచలన ప్రకటన!

Vijay Latest News: విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని, లేదా ఫలానా రాజకీయ కూటమికి బీ టీమ్ గా ఉంటారని ప్రచారం సాగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు విజయ్ తాను ప్రజల టీమ్‌ అని, ఎవరితోనూ కలవడం లేదని స్పష్టం చేశారు.
  • తన పార్టీ లౌకికవాదం, సామాజిక న్యాయంపై ఆధారపడి ఉంటుందని విజయ్ తెలిపారు.
  • అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ప్రసక్తే లేదని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
  • రాబోయే ప్రభుత్వానికి టీవీకే పార్టీ నాయకత్వం వహిస్తుందని విజయ్ ప్రకటించారు.

Vijay Latest News: తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి కంటే నటుడు విజయ్‌ పెట్టిన టీవీకే పార్టీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి చాలా రకాలుగా విమర్శలు పుకార్లు వస్తూనే ఉన్నాయ. అన్నింటిపై విజయ్ స్పందించారు. తన రాజకీయ పంథా, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన ప్రకటన చేశారు. ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ తాను కేవలం ప్రజల టీమ్‌ అని తేల్చి చెప్పారు. 

పుకార్లకు స్వస్తి

విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని, లేదా ఫలానా రాజకీయ కూటమికి బీ టీమ్ గా ఉంటారని సోషల్ మీడియాలో, రాజకీయ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై ఆయన నేరుగా స్పందించారు. మనం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మన గురించి ఆ టీమ్‌ అని ఈ టీమ్ అని ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే ఈ నిందలన్నీ ప్రజల దృష్టిలో వీగిపోయాయని, తాను కేవలం ప్రజల కోసం పని చేసే పీపుల్స్‌ టీమ్‌ అని అందరికీ అర్థమైందని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తనపై వేయడానికి ఇంకే నిందలు లేక చివరకు త్వరలో ఏదో ఒక కూటమితో చేతులు కలపబోతున్నాననే కొత్త అబద్ధపు ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. ఈ గందరగోళానికి తెరదించుతూ, తాను ఎవరితోనూ కలవడం లేదని ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో పోరాడుతానని స్పష్టం చేశారు. 

చెన్నైలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఏఐఏడీఎంకే-బీజేపీతో ఎలాంటి పొత్తు చర్చలు లేవని చెప్పారు. తన పార్టీ సెక్యులరిజమ్‌, సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉందన్నారు. ఈ సిద్ధాంతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

మన నాయకత్వంలోనే పాలన ఉండాలని అే విషయంలో ఎప్పుడూ దృఢంగానే ఉన్నామని, అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. తన మొదటి మహాసభలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నానని, రాజకీయాల్లో ఎవరి కోసమైనా, దేని కోసమైనా రాజీ పడటం  అనే చర్చకే తావు లేదని పునరుద్ఘాటించారు.  

తనపై వస్తున్న నిందలను నమ్మొద్దని విజయ్ ప్రజలు సూచించారు. ప్రత్యర్థులు చేసే కుట్రలు తన లక్ష్యాన్ని అడ్డుకోలేవని ఆయన పేర్కొన్నారు.  సర్వశక్తిమంతుడైన ఆ దేవుడి దయతో మనం అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం అని చెప్పారు. 

రాజకీయ శత్రువు డీఎంకే అని, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని బహిరంగంగా ప్రకటించిన విజయ్, తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన వెళ్లిన ప్రతిచోటా మంచి ఆదరణ లభించినప్పటికీ, కరూర్‌లో ఆయన ప్రచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటన ఆయన రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది.

ఈ ఘటన తర్వాత, సీబీఐ విచారణలో చిక్కుకున్న విజయ్, నెల రోజుల తర్వాతే ఇంటి నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఆయన రాజకీయంగా యాక్టివ్ అయినప్పుడు 'జన నాయకన్' సినిమాపై నిషేధం, భార్య సంగీత నుంచి విడాకులు, ఇతర ఆరోపణలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.  

ఈ క్రమంలోనే డీఎంకేను ఓడించేందుకు విజయ్‌ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చేరతారని ప్రచారం జరిగింది. దీనికి పవన్ మధ్యవర్తిత్వం సాగిస్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి. తర్వాత త్రిష కూడా అమిత్‌షాతో సమావేశమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటినీ పుల్‌స్టాప్ పెడుతూ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చేరబోనని విజయ్ క్లారిటీ ఇచ్చేశారు. 

టీవీకేను లౌకిక పార్టీగా ప్రకటించి, బీజేపీని రాజకీయ శత్రువుగా పేర్కొంటూ ఆ పార్టీతో విజయ్ పొత్తు పెట్టుకుంటే, అది తన పార్టీ భవిష్యత్తుకు ఎదురుదెబ్బ అవుతుందని ఆయన మద్దతుదారులు, అభిమానులు భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ కూటమితో పొత్తు లేదని ప్రకటించిన విజయ్‌ వచ్చే ప్రభుత్వం టీవీకే నేతృత్వం వహిస్తుందని స్పష్టంగా చెప్పారు.

Frequently Asked Questions

విజయ్‌ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?

విజయ్‌ పార్టీ సెక్యులరిజమ్‌ మరియు సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే రెండు ప్రధాన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. ఈ సిద్ధాంతాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

విజయ్‌ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు?

విజయ్‌ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చేరబోనని స్పష్టత ఇచ్చారు. తాను ఎవరితోనూ కలవడం లేదని, ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో పోరాడుతానని తెలిపారు.

విజయ్‌పై వస్తున్న పుకార్లపై ఆయన స్పందన ఏమిటి?

తనపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని విజయ్‌ సూచించారు. తాను కేవలం ప్రజల కోసం పని చేసే 'పీపుల్స్‌ టీమ్‌' అని, ప్రత్యర్థులు చేసే కుట్రలు తన లక్ష్యాన్ని అడ్డుకోలేవని ఆయన పేర్కొన్నారు.

కూరులో జరిగిన తొక్కిసలాట సంఘటన తర్వాత విజయ్‌ రాజకీయ జీవితం ఎలా ప్రభావితమైంది?

కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటన తర్వాత, విజయ్‌ సీబీఐ విచారణలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్ అయినప్పుడు 'జన నాయకన్' సినిమాపై నిషేధం, భార్య సంగీత నుంచి విడాకులు వంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Embed widget