అన్వేషించండి

YS Jagan: సీఈసీపై అభిశంసన - జగన్‌కు పెద్ద సమస్య ! మద్దతివ్వకపోతే ఓట్ల గల్లంతు,ఈవీఎంలపై ఎలా మాట్లాడగలరు?

CEC impeachment motion: సీఈసీపై ఇండీ కూటమి పెట్టిన అభిశంసన తీర్మానానికి జగన్ మద్దతు ఇవ్వడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ వాదించడమే దీనికి కారణం.

Will Jagan support CEC impeachment motion : జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే.. ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తక్షణమే మద్దతు ప్రకటించాలని ఏపీ పీసీసీ చీఫ్  వైఎస్ షర్మిల సవాల్ చేశారు.  గత ఎన్నికల్లో ఈవీఎంలు మారిపోయాయని,  ఓట్లు గల్లంతయ్యాయని జగన్ చేసిన ఆరోపణలు నిజమే అయితే, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఎన్నికల కమీషన్‌ను నిలదీసే అవకాశం వచ్చిందని ఆమె అంటున్నారు.  షర్మిల విసిరిన సవాల్ జగన్‌ను రాజకీయంగా ఇరకాటంలో నెట్టింది. 

షర్మిల సూటి సవాల్ – జగన్ స్పందన ఏది? 

గత ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జగన్ మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే.. ఇప్పుడు దాన్ని నిరూపించే సమయం వచ్చింది  అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల కమీషన్ పనితీరుపై నమ్మకం లేనప్పుడు, ఆ వ్యవస్థకు బాధ్యుడైన ప్రధానాధికారిపై విపక్షాలు తెచ్చిన అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా జగన్ ఎందుకు వెనకాడుతున్నారనేది చాలా మందికి వచ్చే సందేహం. ఇది కేవలం సవాల్ మాత్రమే కాదు, జగన్ చిత్తశుద్ధిని తేల్చే ఒక గీటురాయిగా మారింది.

వైసీపీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు 

వైసీపీ తీరును గమనిస్తే ఇక్కడ ఒక స్పష్టమైన  తేడా  కనిపిస్తుంది. ఓట్ల పోలింగ్ లో తేడాలని.. ఈవీఎంలపై నమ్మకం లేదని జగన్ అంటున్నారు. ఇలాంటి సమయంలో  పార్లమెంట్ వేదికగా అదే ఈసీని నిలదీసే అవకాశం వచ్చినప్పుడు మౌనం వహించడం ఏ రకమైన పోరాటమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఫలితాల్లో అక్రమాలు జరిగాయని నమ్మితే, ఇండియా కూటమితో కలిసి ఈ పోరాటంలో భాగస్వామి కావాలి. అలా కాకుండా మౌనంగా ఉంటే, ఆయన చేస్తున్న పోరాటమంతా కేవలం కార్యకర్తలను బుజ్జగించడానికి చేస్తున్న డ్రామా అనే ముద్ర పడే ప్రమాదం ఉంది.

వైసీపీకి ఇది లిట్మస్ టెస్ట్ 

ఈ అభిశంసన తీర్మానం వైసీపీకి ఒక రకమైన విషమ పరీక్ష. ఒకవేళ తీర్మానానికి మద్దతు ఇస్తే, కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే.. ఈవీఎంలపై తను చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని జగన్ స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుంది. అంటే, అటు కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి, ఇటు తన ఓటమికి ఈవీఎంలే కారణమనే తన పాత వాదనను కూడా కాపాడుకోవాలి. ఈ రెండింటి మధ్య జగన్ రెడ్డి ఏ దారి ఎంచుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.  

విశ్వసనీయత ప్రశ్నార్థకం 

రాజకీయాల్లో విశ్వసనీయత   అనేది చాలా ముఖ్యం. జగన్ మోహన్  రెడ్డి తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెబుతూనే, ఆ ఈవీఎంలను పర్యవేక్షించిన అధికారులపై చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం ఆయన బలహీనతను సూచిస్తోంది. ఒకవేళ వైసీపీ ఈ తీర్మానం నుంచి తప్పుకుంటే, రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు  మీరు ఈసీని ఎందుకు నిలదీయలేదు అన్న ప్రశ్న ఎదురైతే జగన్ వద్ద సమాధానం ఉండదు. షర్మిల విసిరిన ఈ సవాల్‌తో జగన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారని, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన చేసే తదుపరి అడుగులు అత్యంత కీలకంగా మారాయని చెప్పవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget