అన్వేషించండి

YS Sharmila fires on Jagan: అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?

Sharmila criticized YS Jagan: వివేకా హత్య వెనుక అసలు నిజాలను షర్మిల వెల్లడించారు. జగన్, అవినాష్‌లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Sharmila once again strongly criticized YS Jagan in the Viveka murder case:  అన్న అనే పేరుకే జగన్ కళంకం అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె... వివేకా హత్య కేసులో  సునీత, ఆమె భర్తపై అవినాష్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. 

కడప ఎంపీ టిక్కెట్ కోసమే వివేకా హత్య 

వివేకానంద రెడ్డి హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని షర్మిల స్పష్టం చేశారు.  కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి సరికాదని, ఆయనకు టికెట్ ఇవ్వవద్దని వివేకా స్వయంగా నాతో చెప్పారు అని ఆమె గుర్తు చేశారు. వివేకా బతికి ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి అవుతారని భావించే అవినాష్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. వివేకా వారించినా వినకుండా జగన్ మొండిగా అవినాష్‌కే టికెట్ ఇచ్చారని, ఈ హత్యను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో వివేకా కేసు అంశంపై అవినాష్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై  స్పందించారు. 

మీడియా ద్వారా తప్పుడు ప్రచారం 

హత్య జరిగిన సమయంలో సాక్షి మీడియా,  వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలు చేసిన ప్రచారాన్ని షర్మిల తీవ్రంగా  ప్రశ్నించారు.  వివేకాది సహజ మరణమని, గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియా తొలుత  వార్తలు ప్రచారం చేసిందని గుర్తు చేశారు. వివేకాను సునీత భర్తే హత్య చేసినట్లు చిత్రీకరించేందుకు అవినాష్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. కానీ, సునీత భర్త వివేకాను సొంత తండ్రిలా చూసుకునేవారు  అని ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో ఈ హత్యను టీడీపీపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారన్నారు.  ఇప్పుడు కూడా సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వివేకా హత్య జరిగినప్పుడు హైదరాబాద్ లో ఉన్న సునీత దంపతులు ఎలా అక్కడ ఉన్న వారిని ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు.  సాక్ష్యాలు తుడిచేయడమే కాకుండా.. పోస్టుమార్టం కూడా వద్దని అవినాష్ రెడ్డి ఎందుకు ఒత్తిడి చేశారని షర్మిల ప్రశ్నించారు. 

కోర్టు ద్వారానే సీబీఐ విచారణ

నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సునీత ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఎందుకు అంగీకరించలేదని షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా ఈ కేసును కొలిక్కి తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారని, కేవలం కోర్టు ఆదేశాల వల్లే ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. బాధితురాలు సునీత చేస్తున్న పోరాటంలో ఉన్న పట్టుదల, దర్యాప్తు సంస్థల్లో ఎందుకు కనిపించడం లేదు?" అని ఆమె నిలదీశారు.  

 అధికార బలం - దుష్ప్రచారం 

తమ చేతిలో మీడియా, సోషల్ మీడియా ఉన్నాయన్న అహంకారంతో బాధితులపైనే నిందలు వేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా మరణం తర్వాత ఆయన కుటుంబం పడుతున్న వేదనను పట్టించుకోకుండా, నిందితులను వెనకేసుకొస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. న్యాయం కోసం సునీత ఒంటరి పోరాటం చేస్తోందని, వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా నిజం ఒకరోజు బయటపడక తప్పదని ఆమె హెచ్చరించారు.  

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget