Actor Vijay Quits Cinema: నటుడు విజయ్ కెరీర్‌లో కీలకఘట్టం.. సినిమాలకు గుడ్‌బై చెబుతూ దళపతి ఎమోషనల్
Jana Nayagan Audio Launch | నటుడు విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. వచ్చే 30, 35 ఏళ్లు తనవాళ్లు, తనను నమ్మిన వారి కోసం నిలబడతా అని కీలక వ్యాఖ్యలు చేశారు.

నటుడు విజయ్ చివరి చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ఆడియో విడుదల కార్యక్రమం మలేషియాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ కీలక ప్రకటన చేశారు. తాను సినిమా రంగాన్ని వదిలేస్తున్నానని మరోసారి తెలిపారు. "నా కోసం అందరినీ వదులుకున్న అభిమానుల కోసం, రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇదే నా చివరి సినిమా" అని విజయ్ అన్నారు. జీవితంలో విజయం సాధించడానికి, స్నేహితులు అవసరమో లేదో తెలియదు, కానీ మీకు ఖచ్చితంగా ఒక బలమైన శత్రువు అవసరం. ఆ బలమైన శత్రువు ఉంటేనే, మీరు మరింత బలవంతులు అవుతారు" అని విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అజిత్ నటించిన 'బిల్లా'
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో విజయ్ మాట్లాడుతూ.. శ్రీలంక తర్వాత మలేషియాలో అత్యధిక సంఖ్యలో తమిళులు ఉన్నారు. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న కొన్ని తమిళ చిత్రాలను ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేసుకున్నారు. స్నేహితుడు అజిత్ నటించిన 'బిల్లా' మూవీ కూడా ఇక్కడే తీశారు. నా 'కవలాన్’, గురువి వంటి మూవీల షూటింగ్ ఇక్కడే జరిగిందని తెలిపారు.
నాకు రాజభవనాన్ని ఇచ్చిన ఫాన్స్
"నేను సినిమాలోకి వచ్చినప్పుడు, ఈ రంగంలో ఒక చిన్న ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాను. కానీ అభిమానులు నాకు ఏకంగా ఒక రాజభవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇన్నేళ్లు నన్ను ఆధరించిన ప్రేక్షకులకు, నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు, తోటి ఆర్టిస్టులకు ధన్యవాదాలు" అని అన్నారు.
అభిమానుల కోసం పోరాటం
"నా సినీ జీవితంలో మొదటి రోజు నుంచీ నేను అన్ని రకాల విమర్శలను ఎదుర్కొన్నాను. 33 ఏళ్లుగా అభిమానులు మద్దతుగా ఉండటం సులభం కాదు. కానీ మీరు నాకు సపోర్ట్ చేశారు. మీకు కేవలం ధన్యవాదాలు చెప్పి, పక్కకు జరగాలనుకోవడం లేదు. అభిమానుల కోసం, నన్ను ఆదరించిన రాష్ట్ర ప్రజల కోసం వచ్చే 30-33 ఏళ్లు నిలబడతాను. ఈ విజయ్ నన్ను నమ్మిన అభిమానుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం సినిమా నుంచి వైదొలగుతున్నాడు" అని టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ప్రకటించారు.
సంక్రాంతికి విడుదల
నటుడు విజయ్ హీరోగా చివరి సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అయితే తెలుగులో బాలయ్య నటించి, విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. తెలుగులో కుమార్తె - పెంపుడు తండ్రి అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఆ సినిమాను.. విజయ్ రాజకీయ ప్రవేశం కోసం కొన్ని మార్పులతో హెచ్. వినోద్ తెరకెక్కించి ఉంటారని తెలుస్తోంది. విజయ్ చివరి సినిమా కావడంతో, ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుందని మూవీ యూనిట్ ఆశిస్తోంది.
అనిరుద్ మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ స్టోర్
నేను అనిరుధ్‌కు ఒక కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను. అనిరుధ్‌కు మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ స్టోర్ అని పెట్టవచ్చు. ఎందుకంటే మ్యూజిక్ స్టోర్‌కు వెళితే, అక్కడ మీకు కావాల్సిన అన్ని రకాల పాటలు, మ్యూజిక్ లభిస్తాయని అన్నారు.






















